ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. న్యూ ఇయర్ 2026 రిలీజ్

కొత్త ఏడాది వచ్చింది. 2026కు వెల్ కమ్ చెబుతున్నారు జనాలు. ఈ ఏడాది సినీ లవర్స్ ను, ఓటీటీ ప్రేమికులను ఎంటర్ టైన్ చేసేందుకు చాలా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. జనవరి 1న ఓ తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ ఓటీటీలోకి వచ్చి న్యూ ఇయర్ ను స్పెషల్ గా మార్చింది. 

Published on: Jan 1, 2026, 11:37:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూ ఇయర్ వచ్చేసింది. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి మొదలైంది. 2026ను సినీ లవర్స్ కు మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అయ్యాయి. ఈ రోజు ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్ ‘ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్’ అడుగుపెట్టింది. తెలుగులోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ (x)
ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ (x)

ఎల్బీడబ్ల్యూ ఓటీటీ

న్యూ ఇయర్ 2026ను మరింత స్పెషల్ గా మారుస్తూ, ఓటీటీ ఆడియన్స్ కు వెల్ కమ్ చెప్తూ కొత్త వెబ్ సిరీస్ ఇవాళ (జనవరి 1) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్ సిరీస్ గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

4 ఎపిసోడ్లు

ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్ సిరీస్ నాలుగు ఎపిసోడ్లతో ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్‌లో ఇవాళ సీజన్ 1లో నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్‌ ఓటీటీ స్పెషల్ సిరీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

ఎల్బీడబ్ల్యూ స్టోరీ

ఎల్బీడబ్ల్యూ- లవ్ బియాండ్ వికెట్ సిరీస్ ఓ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంది. రంగన్ (విక్రాంత్) టాలెంట్ ఉన్న క్రికెటర్. ఇండియాకు ఆడాలని, దేశానికి గొప్ప పేరు తేవాలని కలలు కంటాడు. తన నైపుణ్యాలతో స్టార్ గా ఎదిగేలా కనిపిస్తాడు. కానీ కొన్ని కారణాలు అతణ్ని వెనక్కి లాగుతాయి. క్రికెట కెరీర్ కు ఫుల్ స్టాప్ పడేలా చేస్తాయి.

కోచ్ గా

క్రికెటర్ గా తాను అనుకున్న స్థాయికి చేరలేకపోయానని, కల నెరవేర్చుకోలేకపోయాననే బాధ రంగన్ లో ఉంటుంది. ఆ సమయంలోనే ముత్తు నగర్ అనే ఓ క్రికెట్ టీమ్ కు కోచ్ గా పనిచేసే ఛాన్స్ వస్తుంది. కానీ ఆ క్రికెట్ టీమ్ లో ఎవరికీ డిసిప్లేన్ ఉండదు. ఓ లక్ష్యం అంటూ ఉండదు. మరి ఈ క్రికెట్ టీమ్ ను రంగన్ ఎలా మార్చాడు? మధ్యలో లవ్ స్టోరీ ఏంటీ? అతని వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఏంటీ? అన్నది ఎల్బీడబ్ల్యూ సిరీస్ లో చూడాల్సిందే.

ప్రతి వారం ఎపిసోడ్

ఎల్బీడబ్ల్యూ సిరీస్ లాంగ్ ఫార్మాట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ఈ రోజు నాలుగు ఎపిసోడ్లు వచ్చాయి. ఇక ప్రతి వారం మరో ఎపిసోడ్ రిలీజ్ అవుతుంటుంది. ఇందులో తమిళ స్టార్ విక్రాంత్ హీరో. నియతి కదంబి, సింధు శ్యామ్, హరీష్, అయాజ్ ఖాన్ తదితరులు నటించారు. ఈ సిరీస్ కు గణేష్ కార్తికేయన్ డైెరెక్టర్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More