Bharathi Raja: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజంగా ఎదిగిన డైరెక్టర్ భారతీరాజా. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీపై తమదైన ముద్ర వేసిన లెజెండరీ డైరెక్టర్లలో ఆయనొకరు. ఇప్పుడు భారతీరాజా ఆరోగ్యం క్షీణించింది. నడవలేని స్థితిలో వీల్ చెయిర్ లో ఉన్న ఆయన్ని చూసి అభిమానులు బాధపడుతున్నారు.
భారతీ రాజా హెల్త్

84 ఏళ్ల భారతీరాజా ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వీల్ చెయిర్ లోనే ఉంటున్నారు. నడవలేకపోతున్నారు.
రాధికా శరత్ కుమార్ వీడియో
భారతీరాజాను ఇటీవల సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కలిశారు. తన గురువు అయిన భారతీరాజాతో ఆమె మాట్లాడుతున్న వీడియోను రాధికా తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.
‘‘నా గురువు, నా డైరెక్టర్ భారతీరాజా నుంచి ఈ ఆశీర్వాదం అవార్డుల కంటే గొప్పది. ఆయన్ని ఇలా చూడాలనుకోలేదు. కానీ ఆ సందర్భాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. తాయ్ కిళవి సినిమా గురించి మాట్లాడారు. సినిమాపై ప్రేయ ఇంకా ఆయన్ని బతికిస్తోంది’’ అని రాధికా క్యాప్షన్ ఇచ్చారు.
అభిమానుల బాధ
రాధికా శరత్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో భారతీ రాజా కండీషన్ చూసి అభిమానులు బాధ పడుతున్నారు. దిగ్గజ దర్శకుడు ఇలా అయిపోయాడేంటీ అని ఆందోళన చెందుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, ఇలాంటి గతి పట్టిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లోనూ రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిళవి సినిమాను భారతీ రాజా చూడటం విశేషం. చిన్న సినిమాగా వచ్చిన తాయ్ కిళవి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.150 కోట్లు రాబట్టింది.
భారతీరాజా ఎవరు?
{{/usCountry}}ఈ పరిస్థితుల్లోనూ రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిళవి సినిమాను భారతీ రాజా చూడటం విశేషం. చిన్న సినిమాగా వచ్చిన తాయ్ కిళవి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.150 కోట్లు రాబట్టింది.
భారతీరాజా ఎవరు?
{{/usCountry}}భారతీరాజా తమిళ సినిమాల్లో ప్రసిద్ధ చిత్ర దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత, స్క్రీన్‌రైటర్, నటుడు కూడా. ఆయన 1977లో '16 వయతినిలే' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కిళక్కే పోగుమ్ రైలు', 'సిగప్పు రోజాక్కల్', 'అలైగల్ ఒయివతిల్లై', 'కాదల్ ఓవియం', 'ముదల్ మరియాతై' వంటి అనేక చిత్రాలను రూపొందించారు.
ఆయన చిత్రాలకు ఆరు జాతీయ చిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, ఆరు తమిళనాడు రాష్ట్ర చిత్ర అవార్డులు, ఒక నంది అవార్డుతో సహా అనేక పురస్కారాలు లభించాయి.
తెలుగు సినిమాలు
భారతీరాజా తెలుగులోనూ సినిమాలు తీశారు. 1980లో కొత్త జీవితాలు సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. 1981లో సీతాకోక చిలుక సినిమా తీశారు భారతీరాజా. దీనికి జాతీయ అవార్డు అందుకున్నారు. 1988లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా జమదగ్ని మూవీని తెరకెక్కించారు. తెలుగులో ఇదే ఆయనకు చివరి సినిమా. 2004లో భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.