Asha Bhosle: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతార నేలకొరిగింది. తన మధుర గాత్రంతో తరాల అంతరాన్ని చెరిపేసిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఆశా భోంస్లే మృతి

శనివారం రాత్రి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు, గుండె సమస్యలు తలెత్తడంతో ఆశా భోంస్లేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆమె మరణవార్తను కుమారుడు ఆనంద్ భోంస్లే ధృవీకరించారు. రేపు (ఏప్రిల్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మంగేష్కర్ కుటుంబం నుంచి మరో కోకిల
1933లో సంగీత నేపథ్యం ఉన్న మంగేష్కర్ కుటుంబంలో ఆశా జన్మించారు. ఆమె అక్క, దివంగత లతా మంగేష్కర్ భారతీయ సంగీతంలో ఒక శిఖరమైతే, ఆశా భోంస్లే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ఆ స్థాయికి చేరారు. కేవలం 9 ఏళ్ల ప్రాయంలోనే పాడటం ప్రారంభించిన ఆమె, 1943లో తొలిసారి సినీ గీతాన్ని ఆలపించారు.
1950వ దశకం నాటికి బాలీవుడ్‌లో తిరుగులేని గాయనిగా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సంగీత దర్శకులందరికీ ఆమె మొదటి ఛాయిస్‌గా నిలిచారు.
క్యాబరే పాటల నుంచి గజల్స్ వరకు
కెరీర్ ప్రారంభంలో ఆశాను కేవలం క్యాబరే సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ పాడే గాయనిగా మాత్రమే చూసేవారు. కానీ, 'ఉమ్రావ్ జాన్' చిత్రంలోని గజల్స్‌తో తనలో మరో కోణాన్ని ప్రపంచానికి ఆమె పరిచయం చేశారు.
ఏడు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, రెండుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. 'దిల్ చీజ్ క్యా హై' (ఉమ్రావ్ జాన్), 'మేరా కుచ్ సామాన్' (ఇజాజత్) పాటలకు గాను ఆమెకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఆమె వివిధ భాషల్లో 12 వేలకు పైగా పాటలను ఆలపించారు.
నేటి సంగీతంపై
{{/usCountry}}ఏడు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, రెండుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. 'దిల్ చీజ్ క్యా హై' (ఉమ్రావ్ జాన్), 'మేరా కుచ్ సామాన్' (ఇజాజత్) పాటలకు గాను ఆమెకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఆమె వివిధ భాషల్లో 12 వేలకు పైగా పాటలను ఆలపించారు.
నేటి సంగీతంపై
{{/usCountry}}గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో నేటి సంగీత ధోరణులపై ఆశా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. "నిజం చెప్పాలంటే నేను ఇప్పటి పాటలు అసలు వినను. నాకు పాటలు వినాలనిపిస్తే భీమ్‌సేన్ జోషి శాస్త్రీయ సంగీతం లేదా గజల్స్ వింటాను.
వాటి ద్వారా నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను, నా సాధన మెరుగుపడుతుంది. ఇప్పటి పాటల్లో అర్థవంతమైన సాహిత్యం కనిపించడం లేదు. అప్పుడప్పుడు రాహత్ ఫతే అలీ ఖాన్, సునిధి చౌహాన్ పాడిన కొన్ని పాటలు బాగుంటాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఒడుదొడుకుల జీవితం
ఆశా వ్యక్తిగత జీవితం అనేక మలుపులతో సాగింది. 16 ఏళ్ల వయసులో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా 31 ఏళ్ల గణపత్‌రావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. అయితే, అత్తమామల వేధింపుల కారణంగా 1960లో ముగ్గురు పిల్లలతో సహా ఆమె బయటకు వచ్చేశారు.
ఆ తర్వాత 1980లో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన ప్రముఖ సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్‌ను పెళ్లాడారు. వీరిద్దరి ప్రేమాయణానికి బర్మన్ కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైంది. 1994లో ఆర్డీ బర్మన్ మరణించే వరకు వీరి బంధం కొనసాగింది. చివరి రోజుల్లో ఆమె మనవరాలు జనాయ్ భోంస్లే ఆమెకు తోడుగా ఉన్నారు.