S Janaki Last Video: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అపురూపమైన, దైవికమైన అధ్యాయం ముగిసింది. కోట్లాది మంది అభిమానులు ‘జానకమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకునే వెటరన్ సింగర్ ఎస్.జానకి శనివారం (జూలై 11) కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన 88వ ఏట తుదిశ్వాస విడిచిన జానకమ్మ చివరి వీడియో వైరల్ గా మారింది.
జానకమ్మ చివరి వీడియో

వేలాది పాటలతో సంగీత ప్రియులను సమ్మోహనపరిచిన సంగీత శిఖరం మన జానకమ్మ. ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అయితే ఈ సమయంలో జానకి చివరి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పాటలే ప్రాణంగా సాగిన ఆమె.. ఆ వీడియోలోనూ పాటలను వింటూ సంతోషంతో మురిసిపోయారు.
సింగర్ సునీతతో
ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో జానకమ్మ కోసం సింగర్ సునీత పాటలు పాడటం కనిపిస్తోంది. జానకమ్మ ఇంట్లోనే ఓ చిన్నపాటి సంగీత విభావరిలా ఇది సాగింది. జానకమ్మ కాళ్ల దగ్గర కూర్చున్న సునీత పాట పాడింది. ఆ పాటకు తగ్గట్లుగా జానకమ్మ చేతులతోనే తాళం వేసింది. ఇప్పుడీ వీడియో చూస్తు జానకమ్మ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అదే చివరి కోరిక
60 ఏళ్ల పాటు 48 వేలకు పైగా పాటలతో ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగారు జానకమ్మ. ఇప్పుడు 88 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకమ్మ చివరి కోరిక గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండీ గ్రామంలో తన అంత్యక్రియలు చేయాలన్నదే జానకమ్మ ఆఖరి కోరికగా తెలిసింది.
ప్రభుత్వ లాంఛనాలతో
{{/usCountry}}60 ఏళ్ల పాటు 48 వేలకు పైగా పాటలతో ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగారు జానకమ్మ. ఇప్పుడు 88 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకమ్మ చివరి కోరిక గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండీ గ్రామంలో తన అంత్యక్రియలు చేయాలన్నదే జానకమ్మ ఆఖరి కోరికగా తెలిసింది.
ప్రభుత్వ లాంఛనాలతో
{{/usCountry}}తెలుగు నాట పుట్టి విశ్వవ్యాప్తమైన జానకమ్మ అంత్యక్రియలు కన్నడ గడ్డపై జరుగనున్నాయి. ఆమె ఆఖరి కోరిక మేరకు కర్ణాటక రాష్ట్రంలోని కణియర హుండీలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు (జూలై 12) సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అభిమానులు, సెలబ్రిటీల సందర్శనార్థం జానకమ్మ పార్థివ దేహాన్ని మైసూర్ లోని మహారాజా కాలేజీ గ్రౌండ్ లో ఉంచారు. జానకి 20 భాషల్లో పాటలు పాడటం విశేషం. అంతే కాకుండా పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడగా గొంతు మార్చి పాటలు పాడిన ఘనత జానకమ్మ సొంతం. అందుకే జానకమ్మ అంటే కేవలం ఓ వ్యక్తి మాత్రమే కాదు.. తన పాటలతో సంగీత ప్రపంచాన్ని ఏలిన ఓ మహారాణి.