Sobhan Babu Wife: టాలీవుడ్ క్లాసిక్ ఎరాలో మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు శోభన్ బాబు (Sobhan Babu). తాజాగా ఆయన భార్య శాంత కుమారి (Shanta Kumari) వృద్ధాప్య కారణాల వల్ల చెన్నైలోని వారి నివాసంలో తుదిశ్వాస విడిచారనే వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.
మీడియాకు దూరంగా

సోషల్ మీడియాలో ప్రస్తుతం శోభన్ బాబు భార్య శాంత కుమారి మరణం వార్త వైరల్ అవుతోంది. అయితే, ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా ఆమె ఎందుకు ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు? ఇండస్ట్రీని శాసించిన వారి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వెనుక ఆమె పాత్ర ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
1958 నాటి బంధం!
శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే, అంటే 1958లోనే శాంత కుమారితో ఆయన వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగి, వందలాది సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో శోభన్ బాబుకు మహిళా ఫాలోయింగ్ పీక్స్‌లో ఉండేది.
అయినప్పటికీ, శాంత కుమారి ఎప్పుడూ ఈర్ష్యకు లోనుకాకుండా, భర్త వృత్తిని గౌరవిస్తూ వచ్చారు. సినిమా ఈవెంట్లకు, షూటింగులకు, సక్సెస్ పార్టీలకు ఆమె పూర్తిగా దూరంగా ఉన్నారు. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలను ఆమె ఒక సాధారణ గృహిణిలా భుజాన వేసుకున్నారు. ఈ పక్కా ఫ్యామిలీ క్రమశిక్షణే శోభన్ బాబును ఇండస్ట్రీలో ఒక ‘మిస్టర్ పర్ఫెక్ట్’గా నిలబెట్టింది.
భార్యకు ఇచ్చిన మాట కోసమేనా?
చాలా మంది హీరోలు వయసు పైబడ్డాక కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉంటారు. కానీ శోభన్ బాబు మాత్రం తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే (1996లో) సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. దీని వెనుక భార్య శాంత కుమారికి ఆయన ఇచ్చిన మాట కూడా ఒక ముఖ్య కారణం.
{{/usCountry}}చాలా మంది హీరోలు వయసు పైబడ్డాక కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉంటారు. కానీ శోభన్ బాబు మాత్రం తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే (1996లో) సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. దీని వెనుక భార్య శాంత కుమారికి ఆయన ఇచ్చిన మాట కూడా ఒక ముఖ్య కారణం.
{{/usCountry}}"తెరపై తనను ‘అందగాడు’గా చూసిన ప్రేక్షకులు, ముసలి వయసులో వైట్ హెయిర్‌తో చూసి నిరాశ పడకూడదని.. మిగిలిన జీవితాన్ని భార్య, పిల్లలతో ప్రశాంతంగా గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు. చెన్నైలో సెటిల్ అయ్యాక ఆయనను కలవడానికి నిర్మాతలు కోట్లు పట్టుకుని వచ్చినా ఒప్పుకోలేదు’’ అని ఇండస్ట్రీ టాక్.
వేల కోట్ల ఆస్తుల వెనుక
సినిమా సర్కిల్స్‌లో శోభన్ బాబు సంపాదన, ఆయన చేసిన ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక పెద్ద పాఠం. ఆ రోజుల్లోనే ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని చెన్నై, పరిసర ప్రాంతాల్లో భూముల రూపంలో పెట్టారు. నేడు ఆ ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందని టాక్.
ఇంత భారీ ఆస్తి ఉన్నప్పటికీ, శోభన్ బాబు మరణం తర్వాత కూడా వారి కుటుంబంలో ఎలాంటి లీగల్ వివాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ బయటకు రాలేదు. దానికి కారణం శాంత కుమారి తన పిల్లలైన కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదితలను పెంచిన పద్ధతి, ఆమె చూపిన ఆదర్శమేనని ఇండస్ట్రీ పెద్దలు చెప్తారు. శోభన్ బాబు 2008లో చనిపోయారు.