Lenin Twitter Review: అఖిల్ లెనిన్ ట్విటర్ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టారా? నెటిజన్లు ఏమంటున్నారు? ఎన్టీఆర్ సర్ ప్రైజ్

Lenin Twitter Review: టాలీవుడ్ లో రీసెంట్ గా బాగా బజ్ తెచ్చుకున్న మూవీ ‘లెనిన్’. అక్కినేని నట వారసుడి అఖిల్ కు కచ్చితంగా హిట్ ఇస్తుందని ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇవాళ థియేటర్లలో రిలీజైన లెనిన్ ఎలా ఉంది? నెటిజన్లు ఏమంటున్నారో ట్విటర్ రివ్యూలో చూసేయండి.

Published on: Jul 10, 2026, 08:50:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lenin Twitter Review: ఒక్క సాలిడ్ హిట్ కోసం అక్కినేని అఖిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీలతో, వేర్వేరు జోనర్లలో సినిమాలు చేసినా.. అఖిల్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో థియేటర్లలోకి ఇవాళ (జూలై 10) వచ్చిన లెనిన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోననే సస్పెన్స్ నెలకొంది.

అఖిల్ లెనిన్ ట్విటర్ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టారా? నెటిజన్లు ఏమంటున్నారు? ఎన్టీఆర్ సర్ ప్రైజ్ (x/SitharaEnts)
అఖిల్ లెనిన్ ట్విటర్ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టారా? నెటిజన్లు ఏమంటున్నారు? ఎన్టీఆర్ సర్ ప్రైజ్ (x/SitharaEnts)

లెనిన్ ట్విటర్ రివ్యూ

అక్కినేని అఖిల్ కు ఎట్టకేలకు ఓ సాలిడ్ హిట్ దొరికినట్లే.. ఇదే ఇప్పుడు లెనిన్ మూవీ చూసిన నెటిజన్లలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫీలింగ్. అవును.. ఈ మూవీకి ట్విటర్ (ఎక్స్)లో మెజారిటీ జనాలు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని, అఖిల్ యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందని, తమన్ బీజీఎం అదిరిపోయింది, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్ష్ వేరే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు.

కెరీర్ బెస్ట్ ఫిల్మ్

లెనిన్ మూవీ అక్కినేని అఖిల్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని ఓ నెటిజన్ ఎక్స్ లో తన రివ్యూ రాసుకొచ్చాడు. ‘‘హిట్ బొమ్మ. ఇటీవల కాలంలో మంచి ట్విస్ట్ లతో ఉన్న గుడ్ కమర్షియల్ బొమ్మ. అఖిల్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది’’ అని ఆ యూజర్ పేర్కొన్నాడు.

బ్లాక్ బస్టర్

‘‘అక్కినేని ఫ్యామిలీకి, అఖిల్ కు కరవు తీరింది. బ్లాక్ బస్టర్. సెకండాఫ్ ఎక్స్ లెంట్ గా ఉంది. డ్రామా బాగుంది. బిగ్ హిట్ అవొచ్చు. ప్రతీది బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ ఎమోషన్ కూడా కలిసొచ్చింది. అసలు బోరింగ్ మూమెంట్స్ లేవు. ట్విస్ట్ లన్నీ పేలాయి. 3.25/5’’ అని ఓ నెటిజన్ తన ఫీలింగ్ పంచుకున్నాడు.

ఎమోషన్ మిస్ అయిందంటూ

లెనిన్ మూవీపై మెజారిటీ జనాలు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమాలో ఎమోషనల్ డెప్త్ మిస్ అయిందని పోస్టులు పెడుతున్నారు. ‘‘లెనిన్ సినిమా ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్. చాలా బ్లాక్స్ బాగున్నాయి. కానీ వాటిని ఎలివేట్ చేసే ఎమోషన్ మిస్ అయింది. మహాభారతం నుంచి స్ఫూర్తి పొంది, ఓ రూరల్ ప్రపంచాన్ని డైరెక్టర్ మురళీ కిశోర్ రూపొందించారు.

స్క్రీన్ ప్లే బాగుంది. హీరో- విలన్ పోరు బాగుంది. రొమాన్స్ మాత్రం వీక్. ప్రి ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపందుకుంది. ట్విస్ట్ లు, ఎలివేషన్స్ తో సెకండాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. కానీ మూవీకి సెట్ బ్యాక్ అంటే లవ్ స్టోరీ. తమన్ బీజీఎం అదిరిపోయింది. డీసెంట్ వన్ టైమ్ వాచ్ మూవీ లెనిన్’’ అని ఓ నెటిజన్ తన పూర్తి రివ్యూ పంచుకున్నాడు. కొంతమంది ఏమో ఫస్టాఫ్ వీక్ అని పేర్కొంటున్నారు.

ఎన్టీఆర్ సర్ ప్రైజ్

లెనిన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సర్ ప్రైజ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహాభారతం స్టోరీ చెప్తూ వచ్చే తారక్ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పిస్తోందని పోస్టులు పెడుతున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More