ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఇక ఇందులోనూ థ్రిల్లర్లు అంటే వేరే లెవల్. అలాంటి ఓ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరే.. ‘లాక్ డౌన్’. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది.
లాక్ డౌన్ ఓటీటీ

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన మూవీ ‘లాక్ డౌన్’. ఈ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ ఈ రోజు (మార్చి 11) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లాక్ డౌన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది లాక్ డౌన్ మూవీ.
తెలుగులోనూ
తమిళంలో తెరకెక్కిన లాక్ డౌన్ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ లాక్ డౌన్ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు.
ఎప్పుడో రిలీజ్
నిజానికి లాక్ డౌన్ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కరోనా టైమ్, లాక్ డౌన్ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జనవరి 30, 2026న థియేటర్లలో ఈ లాక్ డౌన్ సినిమా రిలీజైంది. అయితే మూవీ స్టోరీ పాతది కావడం, నేపథ్యం కూడా పాతదే కావడంతో సినిమా పెద్దగా జనాలకు రీచ్ కాలేకపోయింది.
నెల రోజుల తర్వాత
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ లాక్ డౌన్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ, మార్చి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఎ.ఆర్.జీవా డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
లాక్ డౌన్ స్టోరీ
{{/usCountry}}అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ లాక్ డౌన్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ, మార్చి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఎ.ఆర్.జీవా డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
లాక్ డౌన్ స్టోరీ
{{/usCountry}}అనిత (అనుపమ పరమేశ్వరన్) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటుంది. అయితే ఒక రోజు పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో జరిగిన సంఘటన వల్ల అనుకోకుండా ప్రెగ్నెంట్ అవుతుంది.
తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అనిత ఇంట్లో చెప్పలేకపోతుంది. గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల అనిత బయటకు వెళ్లలేకపోతుంది. హాస్పిటల్స్ లో మొత్తం కరోనా పేషెంట్లనే ట్రీట్ చేస్తారు. దీంతో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచలేక, బయటకు వెళ్లలేక అనిత తీవ్ర మనోవేదనకు గురవుతుంది.
మరి చివరకు ఏం జరిగింది? అనిత ప్రెగ్నెన్సీ విషయం తెలిసిందా? ఈ సినిమాలోని మిగతా కథల ప్రాధాన్యం ఏంటీ? అన్నది లాక్ డౌన్ మూవీలో చూడాల్సిందే.