మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1: చంద్ర డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియోహాట్‌స్టార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
లోకా ఓటీటీ రిలీజ్ డేట్

కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన మూవీ లోకా ఛాప్టర్ 1: చంద్ర. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీని అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ శుక్రవారం (అక్టోబర్ 24) తెలిపింది.
“లోకా ప్రపంచం ఎక్స్‌క్లూజివ్ గా జియోహాట్‌స్టార్ లో తెరుచుకోబోతోంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అని చెప్పింది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ లోకా మూవీ స్ట్రీమింగ్ కానుంది.
రూ.300 కోట్ల వసూళ్ల తొలి మలయాళం మూవీ
మలయాళం ఇండస్ట్రీలో రూ.300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా ఈ లోకా ఛాప్టర్ 1: చంద్ర నిలిచింది. ఈ క్రమంలో మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ రికార్డును బ్రేక్ చేసింది. నిజానికి ఈ సినిమా స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్ లోనే అని చాలా రోజుల కిందటే తేలిపోయినా.. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల మార్క్ దాటేంత వరకు స్ట్రీమింగ్ తేదీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. 'లోకా ఛాప్టర్ 1' ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది.
{{/usCountry}}దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. 'లోకా ఛాప్టర్ 1' ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది.
{{/usCountry}}