LCU: అది ఫ్యాన్స్ ఇచ్చిన పేరే.. నేను కొనసాగిస్తున్నాను.. నా ఆఫీస్ మూసేస్తాను కానీ.. ఎల్‌సీయూ ఆపను: లోకేష్ కనగరాజ్
LCU: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ఎల్‌సీయూ ముగిస్తోందన్న పుకార్లపై స్పందించాడు. అదంతా ఉత్తదే అని తేల్చి చెప్పాడు. నిజానికి ఆ పేరు అభిమానులే పెట్టారని, తాను దానిని కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.
LCU: కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి ఒక సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ఇక్కడితో ఆగిపోయిందని, ఇక ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమాలు రావని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ వార్తలపై లోకేష్ ఓపెన్ అవుతూ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఆఫీస్ మూసేస్తా కానీ..
ఈమధ్యే గలాటా ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన క్లారిటీ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతోంది. "ఎల్సీయూ ఇక ముగిసిపోయిందని బయట చాలా బజ్ నడుస్తోంది. అవసరమైతే నా జీస్క్వాడ్ (GSquad) ప్రొడక్షన్ హౌస్ అయినా మూసేస్తా కానీ ఎల్సీయూను మాత్రం ఎప్పటికీ ఆపను" అని కుండబద్దలు కొట్టాడు.
అసలు ఈ ఎల్సీయూ అనే పేరు తాను పెట్టింది కాదని లోకేష్ గుర్తుచేశాడు. ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ ముద్దుగా పెట్టుకున్న ఆ ట్యాగ్‌ను తాను అడాప్ట్ చేసుకున్నానని, దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నానని చెప్పాడు. తనకి ఎల్సీయూలో ఇంకా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ మూవీ తర్వాతే..
"నేను సడెన్‌గా మీడియా ముందుకు వచ్చి ఇక ఎల్సీయూలో సినిమాలు తీయను అని చెప్పలేను. కార్తితో 'ఖైదీ 2', కమల్ హాసన్ సార్‌తో 'విక్రమ్ 2', అలాగే సూర్యతో 'రోలెక్స్' స్టాండలోన్ ఫిల్మ్ అన్నీ నా అప్ కమింగ్ కమిట్మెంట్స్" అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తాయని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ (AA23) పూర్తి అయిన తర్వాతే మళ్లీ ఎల్సీయూ మూవీస్ పై ఫోకస్ పెడతానని డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. అలాగే తన ప్రొడక్షన్ లో రాబోతున్న 'బెంజ్' సినిమా కూడా ఎల్సీయూలో భాగమేనని స్పష్టం చేశాడు.
ఖైదీతో మొదలైన యూనివర్స్
కార్తి హీరోగా 2019లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'తో ఈ యూనివర్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2022లో కమల్ హాసన్ 'విక్రమ్', 2023లో దళపతి విజయ్ 'లియో' మూవీస్ ఈ ఫ్రాంచైజీలో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ముఖ్యంగా 'విక్రమ్' క్లైమాక్స్‌లో సూర్య చేసిన రోలెక్స్ క్యామియో ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది.
ఇక 'బెంజ్' మూవీ విషయానికి వస్తే, భాగ్యరాజ్ కన్నన్ డైరెక్షన్ లో రాఘవ లారెన్స్, రవి మోహన్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన 'కూలీ' (2025) సినిమాతో లోకేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కేవలం డైరెక్టర్‌గానే కాకుండా యాక్టర్‌గా కూడా లోకేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో వామికా గబ్బి హీరోయిన్‌గా వస్తున్న 'డీసీ' (DC) మూవీతో జులై 31న థియేటర్లలోకి యాక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. బన్నీ మూవీ, రోలెక్స్, ఖైదీ 2 ఇలా ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండటంతో లోకేష్ డేట్స్ దొరకడం కష్టమే అన్నది కోలీవుడ్ టు టాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


