Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్ అవతారంలో లోకేష్ కనగరాజ్.. అఫీషియల్‌గా 'డీసీ' రిలీజ్ డేట్ అనౌన్స్!

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ హీరో అవతారం ఎత్తి వస్తున్న డీసీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో అతడు ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ మూవీ జులై 31న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Published on: Jul 1, 2026, 22:08:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lokesh Kanagaraj: సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'డీసీ' (DC) రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 31న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌తో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తమిళంతోపాటు తెలుగు, హిందీల్లోనూ సినిమా రిలీజ్ కానుంది.

Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్ అవతారంలో లోకేష్ కనగరాజ్.. అఫీషియల్‌గా 'డీసీ' రిలీజ్ డేట్ అనౌన్స్!
Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్ అవతారంలో లోకేష్ కనగరాజ్.. అఫీషియల్‌గా 'డీసీ' రిలీజ్ డేట్ అనౌన్స్!

హీరోగా లోకేష్ కనగరాజ్

ఖైదీ, విక్రమ్, లియో లాంటి ఇండస్ట్రీ హిట్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఫుల్ టైమ్ హీరోగా మారిపోతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో వస్తున్న డీసీ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ ఈ సినిమాను జులై 31న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో సినిమాలోని ముఖ్యమైన క్యారెక్టర్స్ లుక్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా రేంజ్ ఏంటో హింట్ ఇచ్చేసింది. పక్కా రా అండ్ రస్టిక్ వాతావరణంలో, ఊహించని రేంజ్ వయోలెన్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాతో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది.

దేవదాస్, చంద్రల ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ వార్

ఈ సినిమా టైటిల్ 'DC' వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే.. ఇది ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ. ఇందులో ఒకరి పేరు దేవదాస్, ఇంకొకరి పేరు చంద్ర. అందుకే ఈ చిత్రానికి డీసీ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. కెప్టెన్ మిల్లర్, రాకీ లాంటి వైల్డ్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాను తన మార్క్ డార్క్ షేడ్స్‌తో విజువల్ వండర్‌గా మార్చేశాడని టాక్. అరుణ్ రంజన్ అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద అసెట్ కానుంది.

ఇక బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్‌గా ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో పాటు సౌత్‌లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న వామికాకు ఈ క్యారెక్టర్ ఒక మైల్ స్టోన్ కాబోతోంది. లోకేష్ కనగరాజ్ రగ్గడ్ లుక్, వామికా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద అద్భుతంగా వర్కవుట్ అయ్యాయని మూవీ యూనిట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్

సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ (Sun Pictures) ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. జైలర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్యానర్ కావడంతో ప్రమోషన్స్, థియేట్రికల్ రిలీజ్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. జులై చివరి వారంలో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ పిల్లర్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander). లోకేష్ కనగరాజ్ సినిమాలకు అనిరుధ్ ఇచ్చే బీజీఎమ్ ఏ రేంజ్‌లో ఉంటుందో విక్రమ్, లియో సినిమాలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు లోకేష్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ సినిమా కాబట్టి అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ఫ్యాన్స్ గ్యారెంటీగా ఫిక్స్ అయిపోయారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More