...
...
Next Story

క్రేజీ బజ్.. పవన్ కల్యాణ్‌తో కాదు అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తొలి తెలుగు మూవీ.. కథ కూడా విన్న ఐకాన్ స్టార్!

అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీతో మూవీతో తర్వాత మరో స్టార్ తమిళ డైెరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో బన్నీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని, ఇప్పటికే కథ కూడా విన్నాడని తమిళ మీడియా చెబుతోంది.

Published on: Nov 28, 2025, 11:00:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు. అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డీసీ' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈలోపే అతడు నెక్ట్స్ డైరెక్ట్ చేయబోయే సినిమాపై క్రేజీ బజ్ నెలకొంది. తెలుగులో అతడు అల్లు అర్జున్ తో తన తొలి సినిమా చేస్తున్నాడని తమిళ మీడియా చెబుతుండటం విశేషం.

లోకేష్ కథ విన్న అల్లు అర్జున్

క్రేజీ బజ్.. పవన్ కల్యాణ్‌తో కాదు అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తొలి తెలుగు మూవీ.. కథ కూడా విన్న ఐకాన్ స్టార్!
క్రేజీ బజ్.. పవన్ కల్యాణ్‌తో కాదు అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తొలి తెలుగు మూవీ.. కథ కూడా విన్న ఐకాన్ స్టార్!

నిజానికి తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ తర్వాత తెలుగులో పవన్ కల్యాణ్ తో మూవీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా పవర్ స్టార్ కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే కథ కూడా అతనికి చెప్పాడని పలు రిపోర్టులు చెబుతున్నాయి. లోకేష్ హీరోగా నటించిన తర్వాత 'ఖైదీ 2' మూవీని డైరెక్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఒక కథను అల్లు అర్జున్‌కు చెప్పినట్లు సమాచారం.

ఆ కథ అల్లు అర్జున్‌కు కూడా బాగా నచ్చడంతో.. అతని డైరెక్షన్ లో నటించడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ డైరెక్టరే అయిన అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియాలో మూవీలో నటిస్తున్నాడు. అందులో దీపికా పదుకోన్ కూడా నటిస్తోంది. ఆ తర్వాత బన్నీ ఎవరితో మూవీ చేస్తాడన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేకపోగా.. లోకేష్ కనగరాజ్ పేరు తెరపైకి రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

లోకేష్ కనగరాజ్.. నెక్ట్స్ ఏంటి?

దీంతో లోకేష్ నెక్ట్స్ మూవీపై ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ తో మూవీ కోసం అతని టీమ్ తో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు తమిళ మీడియా చెబుతోంది. లోకేష్ కెరీర్లో ఆరు సినిమాలు తీయగా.. కూలీ మినహా మిగిలిన వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతని నెక్ట్స్ మూవీ ఏంటి? ఎవరితో అన్న చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై అతడు త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe