Love and War Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లవ్ అండ్ వార్' నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని అత్యంత గ్లామరస్ క్యాబరే అవతార్‌లో ఆలియా కనిపించడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.
హాట్ క్యాబరే అవతార్‌లో ఆలియా భట్ విజువల్ వండర్

రణ్‌బీర్ కపూర్ ఇంటెన్స్ లుక్ వదిలి హైప్ పెంచిన మేకర్స్.. ఇప్పుడు ఆలియా భట్ పోస్టర్‌తో గ్రాండ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆలియా వైన్ రెడ్ సీక్విన్డ్ డ్రెస్, డ్రామాటిక్ హెడ్ పీస్, స్లిట్ స్కర్ట్ వేసుకుని చైర్‌పై కూర్చుని పర్ఫెక్ట్ క్యాబరే డ్యాన్సర్‌లా కనిపిస్తోంది.
రెట్రో మూడ్‌కి తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌లో రెడ్ కర్టెన్స్, మెరిసిపోయే లైటింగ్స్ తో సంజయ్ లీలా భన్సాలీ మార్క్ గ్రాండ్‌నెస్ క్లియర్‌గా కనిపిస్తోంది. "ఆగ్ భీ.. దిలోన్ కీ జాన్ భీ" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఈ పోస్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనే చెప్పాలి.
పీరియడ్ డ్రామా కాకుండా... కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్న భన్సాలీ
సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు అంటే చారిత్రాత్మక పీరియడ్ సెట్టింగ్స్, రాచరికపు కోటలు గుర్తుకొస్తాయి. అయితే 'లవ్ అండ్ వార్' విషయంలో ఆయన రూట్ మార్చి ఒక మోడర్న్ కంటెంపరరీ వరల్డ్ క్రియేట్ చేస్తున్నట్లు టాక్.
ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'గంగూభాయి కాఠియావాడీ' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆలియా నటనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రణ్‌బీర్, ఆలియా, విక్కీ కౌశల్... మైండ్ బ్లాకింగ్ కాంబినేషన్
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌తో పాటు విక్కీ కౌశల్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇంటెన్స్ రొమాంటిక్ వార్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
{{/usCountry}}ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌తో పాటు విక్కీ కౌశల్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇంటెన్స్ రొమాంటిక్ వార్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
{{/usCountry}}రణ్‌బీర్, విక్కీ గతంలో బ్లాక్‌బస్టర్ 'సంజు' సినిమాలో కలిసి నటించారు. అలాగే ఆలియా, విక్కీ 'రాజీ' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఒకే స్క్రీన్‌పై, అదీ భన్సాలీ డైరెక్షన్‌లో కనిపిస్తుండటం ఇదే తొలిసారి.
2027 సంక్రాంతి ధమాకా... పాన్ ఇండియా రిలీజ్
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పార్ట్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ మ్యూజిక్ వర్క్ కోసం మేకర్స్ ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు.
ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా భారీ స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.