Intimate Scenes: అలాంటి బోల్డ్ సీన్స్ చేసినప్పుడు ఏం చేయలేం.. లీకవుతాయి.. తప్పుదు: లస్ట్ స్టోరీస్ 3 సీన్లపై విజయ్ వర్మ
Intimate Scenes: నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన లస్ట్ స్టోరీస్ 3లో నటించిన విజయ్ వర్మ, రాధికా మదన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులోని బోల్డ్ సీన్లపై వాళ్లు స్పందించారు. అలాంటి సీన్లలో నటించినప్పుడు అవి లీకవుతాయన్న ఆందోళన అవసరం లేదని చెప్పారు.
Intimate Scenes: సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లలో బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయడం నటీనటులకు ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజే. షూటింగ్ సమయంతో పాటు ఆ సీన్స్ బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతాయో అనే భయం ప్రతీ నటుడిలోనూ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఫ్రాంచైజ్ 'లస్ట్ స్టోరీస్ 3' లో నటించిన విజయ్ వర్మ, రాధికా మదన్ ఈ సున్నితమైన అంశంపై ఓపెన్‌గా మాట్లాడారు.

బోల్డ్ సీన్స్ లీక్ అవ్వడం, నెట్‌లో వైరల్ కావడంపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. నటులుగా పని చేసేటప్పుడు ప్రేక్షకుల చూపును పట్టించుకోకుండా తమ పనిపైనే దృష్టి పెట్టాలని చెప్పారు.
ఏం చేయలేం.. రిస్క్ అని తెలిసి నటిస్తాం: రాధికా మదన్
'లస్ట్ స్టోరీస్ 3' లో అలీ ఫజల్‌తో కలిసి బోల్డ్ సీన్స్‌లో నటించిన రాధికా మదన్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇలాంటి క్లిప్‌లు లీక్ కావడం అనేది నటుల చేతుల్లో ఉండదని, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నటనపై దృష్టి పెట్టలేమని స్పష్టం చేసింది.
"చూసేవారి చూపు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయగలం? వాళ్ల ఇళ్లకు వెళ్లి క్లిప్పులు చూడొద్దని చెప్పలేం కదా. ఒక ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు అది లీక్ అయ్యే ఛాన్స్ ఉందనే రిస్క్ మాకు ముందే తెలుసు. అలా జరగకూడదని కోరుకుంటూనే నటులుగా మా పని మేము చేసుకుపోతాం" అని రాధిక మదన్ చెప్పుకొచ్చింది.
ఆ భయాలు ఉంటే హద్దులు దాటి నటించలేం: విజయ్ వర్మ
గతంలో 'లస్ట్ స్టోరీస్ 2' లో తమన్నా భాటియాతో కలిసి నటించిన ఇంటిమేట్ సీన్స్ నెట్‌లో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై విజయ్ వర్మ స్పందిస్తూ.. షూటింగ్ చేసే సమయంలో ఆడియన్స్ మైండ్‌సెట్‌ను పక్కన పెట్టడం చాలా ముఖ్యమని తెలిపాడు.
"ఇలాంటి క్లిప్పులు సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో బాగా సర్క్యులేట్ అవుతాయని మాకు తెలుసు. అది ఈ ఇండస్ట్రీలో ఒక భాగమైపోయింది. ప్రతీ చిన్న విషయాన్ని మనసులోకి తీసుకుంటే ఒక నటుడిగా సరిగ్గా నటించలేను, సరికొత్త హద్దులను చెరిపేయలేను" అని విజయ్ వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
భయంతో ఇంట్లోంచి బయటకు రాలేదు: రాధికా ఆప్టే
గతంలో 2016 లో వచ్చిన 'పార్చ్‌డ్' సినిమాలోని న్యూడ్ సీన్స్ లీక్ అయినప్పుడు తాను ఎంతగా భయపడిందో నటి రాధికా ఆప్టే ఇటీవల గుర్తు చేసుకుంది. ఆ క్లిప్ లీక్ అయిన తర్వాత తన సెక్యూరిటీ గురించి చాలా భయపడ్డానని చెప్పింది.
"ఆ సీన్ లీక్ అయ్యాక వరుసగా నాలుగు రోజులు ఇంట్లోంచి బయటకు కూడా రాలేకపోయాను. నా వాచ్‌మన్, డ్రైవర్ కూడా ఆ వీడియో చూశారని తెలిసి షాక్ అయ్యాను. ఒంటరిగా ఉండేదాన్ని కావడంతో ఎవరైనా వచ్చి దాడి చేస్తారేమోనని చాలా భయపడ్డాను" అని రాధికా ఆప్టే ఆనాటి చేదు అనుభవాలను పంచుకుంది.
క్రేజీ డైరెక్టర్ల కాంబోలో 'లస్ట్ స్టోరీస్ 3'
నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతమైన పాపులారిటీ సాధించిన 'లస్ట్ స్టోరీస్' సిరీస్ నుంచి ఇప్పుడు మూడో పార్ట్ వచ్చింది. ఈ సారి ఏకంగా విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ వంటి దిగ్గజ దర్శకులు నాలుగు వేర్వేరు కథలతో ముందుకు వచ్చారు.
మానవ సంబంధాలు, ఆకర్షణ, కోరికల చుట్టూ సాగే ఈ ఆంథాలజీలో విజయ్ వర్మ, రాధిక మదన్, అలీ ఫజల్ వంటి ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


