...
...
Next Story

ఆ బూతు పాట నేను రాయలేదు.. డైరెక్టర్ కావాలని వివాదం చేస్తున్నాడు..: లిరిసిస్ట్ రకీబ్ ఆలమ్ సెన్సేషనల్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్న కేడీ ది డెవిల్ లోని పాటపై తాజాగా లిరిసిస్ట్ రకీబ్ ఆలమ్ స్పందించాడు. ఆ పాటను తాను రాయలేదని, కేవలం కన్నడ వెర్షన్ ను హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశానని అతడు చెప్పడం గమనార్హం.

Published on: Mar 17, 2026, 21:54:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ధృవ సర్జా హీరోగా పాన్ ఇండియా లెవల్‌లో రాబోతున్న కన్నడ సినిమా 'కేడీ ద డెవిల్' (KD The Devil) లోని 'సర్కే చునర్ తేరీ' సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద సెన్సేషన్ అవుతోంది. నోరా ఫతేహి, సంజయ్ దత్‌లపై చిత్రీకరించిన ఈ ఐటెమ్ సాంగ్‌లో పచ్చి బూతులు ఉన్నాయంటూ నెటిజన్లు డైరెక్టర్‌తో పాటు లిరిసిస్ట్‌ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హిందీ వెర్షన్‌లో ఈ పాటకు గీత రచయితగా రకీబ్ ఆలమ్ (Raqueeb Alam) పేరు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు రకీబ్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట తాను రాయలేదని, డైరెక్టర్ కన్నడలో రాస్తే తాను కేవలం హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశానని బాంబ్ పేల్చాడు.

ఆ పాట నా క్రియేషన్ కాదు.. నా పేరు వాడారు

ఆ బూతు పాట నేను రాయలేదు.. డైరెక్టర్ కావాలని వివాదం చేస్తున్నాడు..: లిరిసిస్ట్ రకీబ్ ఆలమ్ సెన్సేషనల్ కామెంట్స్
ఆ బూతు పాట నేను రాయలేదు.. డైరెక్టర్ కావాలని వివాదం చేస్తున్నాడు..: లిరిసిస్ట్ రకీబ్ ఆలమ్ సెన్సేషనల్ కామెంట్స్

రకీబ్ వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. "ఈ సినిమాలో నేను మరో 5 పాటలు రాశాను. కానీ ఈ పాట రాయడానికి ముందే రిజెక్ట్ చేశాను. అప్పుడు వాళ్లు కనీసం హిందీ పదాలు అయినా యాడ్ చేయమని అడిగారు" అని వెల్లడించాడు.

"కానీ ఇప్పుడు తీరా చూస్తే హిందీ వెర్షన్ లిరిసిస్ట్‌గా నా పేరు వేసేశారు. నేను ముందే వద్దు అని చెప్పినా నా పేరు వేయడం పట్ల నేను వాళ్లతో కచ్చితంగా మాట్లాడతాను. ఇది టూ మచ్" అని రకీబ్ ఫైర్ అయ్యాడు.

డైరెక్టర్‌కు కాంట్రవర్సీ కావాలనే ఇలా చేశాడు

ఎన్డీటీవీతో రకీబ్ మాట్లాడుతూ డైరెక్టర్ ప్రేమ్ పై సీరియస్ ఆరోపణలు చేశాడు. "నేను డైరెక్టర్‌కు వెయ్యి సార్లు చెప్పాను.. ఇలాంటి పాట సెన్సార్ బోర్డులో అస్సలు పాస్ అవ్వదని వార్నింగ్ ఇచ్చాను. కానీ డైరెక్టర్ ప్రేమ్ 'నేను చూసుకుంటానులే' అని లైట్ తీసుకున్నాడు. అతనికి కాంట్రవర్సీ కావాలి. ఈ పాటలో కచ్చితంగా 'అచార్' (పచ్చడి), 'దారూ' (మందు) లాంటి పదాలు ఉండాలని డైరెక్టర్ పదే పదే నన్ను ఫోర్స్ చేశాడు" అని రకీబ్ వెల్లడించాడు. ఇక జనాలు ఆ పాటను బూతులు తిడుతుండటంతో రాత్రంతా కూర్చుని తాను మళ్లీ ఆ పాటను కొత్తగా క్లీన్‌గా రాసినట్లు అతను తెలిపాడు.

యూట్యూబ్ నుంచి పాట డిలీట్.. కంగనా ఫైర్

కన్నడ ఇండస్ట్రీలో ప్రేమ్ చాలా పాపులర్ డైరెక్టర్. అతన్ని అక్కడ 'షోమ్యాన్' అని కూడా పిలుస్తారు. గతంలో 'జోగి', 'ఎక్స్‌క్యూజ్‌మీ' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ 'కేడీ ద డెవిల్' సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, విజయ్ సేతుపతి లాంటి పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks