ఏఆర్ రెహ‌మాన్ సారీ చెప్పేలా బ‌ల‌వంతం చేశారు.. విష‌పూరిత గ్యాంగ్‌కు రుజువేం కావాలి: పాటల ర‌చ‌యిత వ‌రుణ్ సంచ‌ల‌న పోస్ట్‌

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. 'ఛావా' సినిమాపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. అయితే రెహమాన్ తో బలవంతంగా సారీ చెప్పించారని పాటల రచయిత వరుణ్ గ్రోవర్ సంచలన పోస్ట్ పెట్టాడు. 

Published on: Jan 18, 2026, 19:30:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు పాటల రచయిత వరుణ్ గ్రోవర్ మద్దుతగా నిలిచాడు. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' సినిమాపై తాను 'విభజనవాద' ధోరణిని గమనించానని చెప్పిన వ్యాఖ్యలతో ఇటీవల రెహమాన్ వార్తల్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, తాను కలిగించిన 'బాధ'కు క్షమాపణలు కోరుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏఆర్ రెహమాన్ కు లిరిసిస్ట్ మద్దతు
ఏఆర్ రెహమాన్ కు లిరిసిస్ట్ మద్దతు

రెహమాన్ కు సపోర్ట్

ఆదివారం (జనవరి 18) జాతీయ అవార్డు గ్రహీత, పాటల రచయిత వరుణ్ గ్రోవర్.. ఏఆర్ రెహమాన్‌కు మద్దతుగా పోస్టు పెట్టాడు. ఈ మొత్తం వ్యవహారంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. వరుణ్ తన ఎక్స్ ఖాతాలో 'లగాన్' చిత్రంలోని రెహమాన్ స్వరపరిచిన 'ఓ పాలన్‌హారే' అనే అభిమానుల అభిమాన గీతం మ్యూజిక్ వీడియోను షేర్ చేశారు.

క్యాప్షన్‌లో.. ‘‘గత 3 దశాబ్దాలలో గొప్ప సంగీత దర్శకుడిని అతి మృదువైన, అత్యంత నిరాడంబరమైన రీతిలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు (పరిశ్రమలోని వారి నుండి కూడా) దాడి చేసి, దుర్భాషలాడారు. అదీ కూడా తన అనుభవం ఆధారంగా చెప్పినందుకు మాత్రమే’’ అని వరుణ్ పోస్టు చేశాడు.

బలవంతంగా సారీ

‘‘మరుసటి రోజే ఆ విషపూరిత గుంపును శాంతింపజేయడానికి క్షమాపణ/స్పష్టత ఇవ్వమని రెహమాన్ ను బలవంతం చేశారు. ఆయన విభజనవాదం పెరుగుతోందని సూచించడానికి దీనికంటే ఎక్కువ రుజువు అవసరమా...?’’ అని వరుణ్ తన పోస్ట్ ముగించాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రెహమాన్ వీడియో

ఛావా మూవీపై తన అభిప్రాయం వివాదాస్పదం కావడంతో తన వీడియో ప్రకటనలో రెహమాన్ భారతదేశాన్ని తన గురువుగా, తన ఇల్లుగా అభివర్ణించారు. ‘‘సంగీతం ఎల్లప్పుడూ మా సంస్కృతిని అనుసంధానించడానికి, గౌరవించడానికి, పురస్కరించడానికి నా మార్గం. భారతదేశం నా ప్రేరణ, నా గురువు, నా ఇల్లు. ఉద్దేశాలు కొన్నిసార్లు అపార్థం అవుతాయని నేను అర్థం చేసుకున్నా.

కానీ నా లక్ష్యం ఎల్లప్పుడూ సంగీతం ద్వారా ఉన్నతీకరించడం, గౌరవించడం, సేవ చేయడం. నేను ఎప్పుడూ బాధ కలిగించాలని కోరుకోలేదు. నా నిజాయితీ మీకు చేరుతుందని ఆశిస్తున్నాను’’ అని రెహమాన్ పేర్కొన్నారు.

వివాదం ఏంటీ?

బీబీసీ ఆసియా నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఒక తమిళ సంగీత దర్శకుడిగా బాలీవుడ్‌లో వివక్షను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అని రెహమాన్‌ను అడిగారు. దానికి ఆయన.. 'బహుశా నాకు దీని గురించి తెలియదు. బహుశా దేవుడు దాచిపెట్టి ఉండవచ్చు, కానీ నేను అలాంటిదేమీ అనుభవించలేదు. గత ఎనిమిదేళ్లుగా బహుశా ఒక శక్తి మార్పు జరిగింది.

సృజనాత్మకత లేని వ్యక్తులు ఇప్పుడు శక్తిని కలిగి ఉన్నారు. ఇది కమ్యూనల్ (మతపరమైన) విషయమై ఉండవచ్చు కూడా? కానీ అది నా ముందు జరగలేదు’’ అని పేర్కొన్న ఆయన.. 'విభజనవాదం'పై సొమ్ము చేసుకుంటున్న 'ఛావా' చిత్రాన్ని విమర్శించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More