Maa Inti Bangaram Collections: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, ఓపెనింగ్ వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఆదివారం (జూన్ 21) నాడు ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది.
మా ఇంటి బంగారం కలెక్షన్లు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం మూడు రోజుల్లోనే మా ఇంటి బంగారం సినిమా ఇండియా వైడ్ నెట్ కలెక్షన్లలో రూ.23.10 కోట్ల మార్కును దాటేసింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సమంత వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
మూడో రోజు ఇలా
ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ 'శాక్నిల్క్' (Sacnilk) అందించిన తాజా గణాంకాల ప్రకారం.. 'మా ఇంటి బంగారం' చిత్రం ఆదివారం (మూడో రోజు) దేశవ్యాప్తంగా రూ.10.10 కోట్ల రికార్డు స్థాయి నెట్ కలెక్షన్లు సాధించింది. శనివారం వచ్చిన రూ.7.65 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 32.0 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.
ఆదివారం నాడు కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మొత్తం 2,965 షోలలో థియేటర్ల ఆక్యుపెన్సీ 44.6 శాతం నుంచి ఒక్కసారిగా 52.4 శాతానికి పెరిగింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ వల్లే ఈ స్థాయిలో వసూళ్లు పెరుగుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు రోజుల్లో సినిమా సాధించిన మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ.26.69 కోట్లకు చేరాయి.
తెలుగు వర్షన్ లీడింగ్
సమంతకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ స్పందన లభిస్తోంది. కేవలం తెలుగు వెర్షన్ నుంచే మూడో రోజు రూ.9.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం నాడు తెలుగులో ఉన్న 2,341 షోలలో ఏకంగా 60.0 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మరోవైపు, తమిళ వెర్షన్ ద్వారా మూడో రోజు రూ.0.60 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. తమిళంలో 624 షోలలో 24.0 శాతం ఆక్యుపెన్సీ నమోదైనప్పటికీ, రానున్న రోజుల్లో అక్కడ కూడా వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓవర్సీస్ లో 1 మిలియన్
{{/usCountry}}సమంతకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ స్పందన లభిస్తోంది. కేవలం తెలుగు వెర్షన్ నుంచే మూడో రోజు రూ.9.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం నాడు తెలుగులో ఉన్న 2,341 షోలలో ఏకంగా 60.0 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మరోవైపు, తమిళ వెర్షన్ ద్వారా మూడో రోజు రూ.0.60 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. తమిళంలో 624 షోలలో 24.0 శాతం ఆక్యుపెన్సీ నమోదైనప్పటికీ, రానున్న రోజుల్లో అక్కడ కూడా వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓవర్సీస్ లో 1 మిలియన్
{{/usCountry}}మా ఇంటి బంగారం మూవీ ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్ మార్కును దాటింది. విదేశాల్లోనూ సమంత మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై సమంత నిర్మించింది.
‘మా ఇంటి బంగారం’ గురించి
ఈ సినిమాలో సమంత 'స్వర్ణ' అనే మధ్యతరగతి మహిళ పాత్రలో నటించారు. ఒక సాంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన స్వర్ణ, తన అత్తగారి ఇంటి సభ్యుల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఆమె గతం నుంచి ఎదురైన ఒక ఊహించని ప్రమాదం ఆమె కొత్త కుటుంబాన్ని చిక్కుల్లో పడేస్తుంది. తనను అనుమానించిన ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ తన అసలు గుర్తింపును దాచిపెట్టి ఎలా పోరాడింది అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, దిగ్నాంత్ మంచాలే, సీనియర్ నటి గౌతమి ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇవ్వగా, ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది.