Maa Inti Bangaaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మూవీ వసూళ్లు మరింత పెంచే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్

మా ఇంటి బంగారం మూవీ నుంచి డిలీట్ చేసిన సీన్లు, బ్లూపర్స్ తో కూడిన వీడియో ఇది. షూటింగ్ సమయంలో కొన్ని సీన్లను షూట్ చేసినా వాటిని సినిమాలో చూపించలేదు. అలాంటి సీన్లను ఈ ఫన్నీ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు దీంతోపాటు షూటింగ్ స్పాట్ బ్లూపర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
వీటిని చూస్తే నవ్వాపుకోలేరు. “మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్, బ్లూపర్స్ సూపర్ ఫన్.. బిగ్ స్క్రీన్లపైనే మరింత ఫన్.. బిగ్గెస్ట్ ఎవర్ ఫిమేల్ లెడ్ తెలుగు సినిమాను థియేటర్లలో చూడండి.. ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి” అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ డిలీటెడ్ సీన్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మూవీలో కాస్త సీరియస్ గా, హై-వోల్టేజ్ యాక్షన్ మోడ్ లో కనిపించిన సమంత.. సెట్స్ లో మాత్రం డైరెక్టర్ నందిని రెడ్డి, గుల్షన్ దేవయ్య, శ్రీముఖిలతో కలిసి చేసిన కామెడీ పనులు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. యాక్షన్ సీన్స్ షూట్ చేసే టైమ్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్, డైలాగ్స్ మర్చిపోయినప్పుడు సామ్ ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఈ వీడియోకి హైలైట్ గా నిలిచాయి.
చరిత్ర సృష్టించిన మా ఇంటి బంగారం
'మా ఇంటి బంగారం' సినిమాతో తెలుగులో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ హిస్టరీని సమంత పూర్తిగా తిరగరాసింది. సుమారు 17 ఏళ్ల క్రితం అనుష్క 'అరుంధతి' క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేసి బిగ్గెస్ట్ ఫీమేల్-లీడ్ తెలుగు మూవీగా భారీ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 92 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ మూవీ.. సమంత కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది.
{{/usCountry}}'మా ఇంటి బంగారం' సినిమాతో తెలుగులో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ హిస్టరీని సమంత పూర్తిగా తిరగరాసింది. సుమారు 17 ఏళ్ల క్రితం అనుష్క 'అరుంధతి' క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేసి బిగ్గెస్ట్ ఫీమేల్-లీడ్ తెలుగు మూవీగా భారీ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 92 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ మూవీ.. సమంత కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది.
{{/usCountry}}స్వర్ణ (ఝాన్సీ) క్యారెక్టర్ లో సామ్ చూపించిన డ్యూయల్ వేరియేషన్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఒక సాధారణ కోడలిగా ఉంటూనే, గతం తాలూకు సీక్రెట్స్ రివీల్ అయినప్పుడు ఆమె చేసే యాక్షన్ స్టంట్స్ కు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సామ్, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించిన ఈ క్వాలిటీ ప్రాజెక్ట్ కి నందిని రెడ్డి క్రియేటివ్ డైరెక్షన్ మెయిన్ పిల్లర్ లా నిలిచింది.
ప్రెగ్నెన్సీ టైమ్ లో యాక్షన్ స్టంట్స్
ఇక ఈ మూవీ కోసం సామ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. తను ప్రెగ్నెంట్ గా ఉన్న టైమ్ లోనే ఎన్నో రిస్క్ తీసుకుని కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ కు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
బ్లూపర్స్ వీడియోలో విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య, సామ్ భర్తగా చేసిన దిగంత్ మంచాలే లతో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా భలే క్యూట్ గా క్యాప్చర్ చేశారు. సీరియస్ డైలాగ్స్ చెప్పేటప్పుడు సడెన్ గా సామ్ నవ్వేయడం, సెట్స్ లో డైరెక్టర్ టెన్షన్ పడుతూనే అందరితో జోకులు వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.