...
...
Next Story

Nandini Reddy Samantha: అందుకే జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సమంతకు ఆ సత్తా ఉంది.. అసలు విషయం బయటపెట్టిన నందినీ రెడ్డి

Nandini Reddy Samantha: టాలీవుడ్ లో డైరెక్టర్ నందినీ రెడ్డి- హీరోయిన్ సమంత కాంబినేషన్ సూపర్ హిట్ అనిపించుకుంటోంది. ‘ఓ బేబీ’ తర్వాత మళ్లీ ‘మా ఇంటి బంగారం’ మూవీతో ఈ జోడీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ సమంత గురించి అసలు విషయాన్ని నందినీ రెడ్డి బయటపెట్టింది.

Published on: Jul 2, 2026, 09:43:15 IST
Advertisement

Nandini Reddy Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సుదీర్ఘ విరామం తర్వాత 'మా ఇంటి బంగారం' చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. నందినీ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా హిందూస్థాన్ టైమ్స్ తో ఇంటర్వ్యూలో సమంత, మా ఇంటి బంగారం మూవీ గురించి నందినీ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

థియేటర్లకు అందుకే

అందుకే జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సమంతకు ఆ సత్తా ఉంది.. అసలు విషయం బయటపెట్టిన నందినీ రెడ్డి
అందుకే జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సమంతకు ఆ సత్తా ఉంది.. అసలు విషయం బయటపెట్టిన నందినీ రెడ్డి

"సమంతను ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్నారు. వారికి నచ్చిన, వారు ఇష్టపడే పాత సమంతను మళ్లీ వెండితెరపై చూపించాలని అనుకున్నాం. అదే జరిగింది. అందుకే ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు" అని నందినీ రెడ్డి వెల్లడించింది. ఈ సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు, సమంతలోని అసలైన స్టార్‌డమ్‌ను సెలబ్రేట్ చేసే మూవీ అని డైరెక్టర్ చెప్పింది.

సమంత సూపర్ స్టార్

సమంత అంకితభావం గురించి నందినీ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించింది. "సమంత ప్రతి విషయంలోనూ సూపర్ స్టార్. నటన, కామెడీ టైమింగ్, ఎమోషన్స్, యాక్షన్, డ్యాన్స్.. ఇలా అన్నింటిలోనూ ఆమె అద్భుతంగా చేసింది. ఆమె టాలెంట్ ను పూర్తిగా స్క్రీన్‌పై చూపించాలన్నదే మా ప్రయత్నం. ఆమెపై ఉన్న ప్రేమే మా ఇంటి బంగారం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని మాకు తెలుసు" అని నందినీ రెడ్డి పేర్కొంది.

ఆ సత్తా ఉంది

మా ఇంటి బంగారం సినిమాలో గుల్షన్ దేవయ్య, మంజూష ముక్కామల్లి, శ్రీముఖి వంటి యాక్టర్లు నటించారు. అయినప్పటికీ సమంత వన్ వుమ్యాన్ షోగా ఈ సినిమాను తన భుజాలపై నడిపించిందని నందినీ రెడ్డి తెలిపింది.

'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ 2025 నవంబర్‌లో ప్రారంభమైంది. దాదాపు ఆరు నుంచి ఏడు నెలల పాటు, మొత్తం 54 రోజుల వర్కింగ్ డేస్‌తో ఈ సినిమా చిత్రీకరణను నందినీ రెడ్డి శరవేగంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను నందిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

సామ్ ప్రెగ్నెన్సీ

"అదృష్టవశాత్తూ మేము సినిమాలోని అత్యధిక భాగం యాక్షన్ సీన్లను ముందే పూర్తి చేశాం. 'తస్సాదియ్యా' అనే సాంగ్ షూట్ చేస్తున్న సమయంలోనే సమంత ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలిసింది. అప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది" అని నందిని చెప్పింది.

జూన్ 19న విడుదలైన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సమంత నటనకు, నందిని మేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks