ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఇలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ‘మేడ్ ఇన్ కొరియా’ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఇండియాలో నంబర్ వన్ మూవీగా ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.
మేడ్ ఇన్ కొరియా ఓటీటీ

ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ ‘మేడ్ ఇన్ కొరియా’. ఆమె చేసిన ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
డైరెక్ట్ గా ఓటీటీ
మేడ్ ఇన్ కొరియా మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కించారు. మార్చి 12న మేడ్ ఇన్ కొరియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మేడ్ ఇన్ కొరియా డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులో ఉంది.
సోషల్ మీడియాలో
మేడ్ ఇన్ కొరియా మూవీకి పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ మూవీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ మూవీ అని, తప్పక చూడాల్సిన సినిమా అంటూ పోస్టులు పెడుతున్నారు.
మేడ్ ఇన్ కొరియా స్టోరీ
కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్ అంటే ఇండియన్ యూత్ కు అలవాటే. కొరియన్ సినిమాలు చూస్తూ, బీటీఎస్ మ్యూజిక్ వింటూ ఎంటర్ టైన్ అవుతారు. చిన్నప్పటి నుంచి కొరియా సినిమాలు చూసి, ఆ మ్యూజిక్ విని ఎలాగైనా అక్కడికి వెళ్లాలనుకున్న ఓ అమ్మాయి కథే ‘మేడ్ ఇన్ కొరియా’.
ఒంటరిగానే కొరియాకు
{{/usCountry}}కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్ అంటే ఇండియన్ యూత్ కు అలవాటే. కొరియన్ సినిమాలు చూస్తూ, బీటీఎస్ మ్యూజిక్ వింటూ ఎంటర్ టైన్ అవుతారు. చిన్నప్పటి నుంచి కొరియా సినిమాలు చూసి, ఆ మ్యూజిక్ విని ఎలాగైనా అక్కడికి వెళ్లాలనుకున్న ఓ అమ్మాయి కథే ‘మేడ్ ఇన్ కొరియా’.
ఒంటరిగానే కొరియాకు
{{/usCountry}}షెన్బా (ప్రియాంక మోహన్) తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయి. ఆమెకు కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్ అంటే పిచ్చి. ఎలాగైనా కొరియా వెళ్లాలని చిన్నప్పటి నుంచి కొరియన్ భాష నేర్చుకుంటుంది. కొరియా వాళ్లలాగే తినడం అలవాటు చేసుకుంటుంది. పెద్దయ్యాక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొరియా వెళ్దామని ప్లాన్ వేస్తుంది. కానీ చివర్లో ఆమె బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తాడు. అయినా ఒంటరిగానే ఆమె దక్షిణ కొరియాలోని సియోల్ సిటీకి వెళ్తుంది.
కొరియా చేరుకున్నాక ఆమెకు అక్కడ ఓ అబ్బాయి (పార్క్ హే జిన్) పరిచయం అవుతాడు. ఇంటి నుంచి తీసుకెళ్లిన డబ్బులు అయిపోయిన తర్వాత కొరియాలో షెన్బా ఏం చేసింది? ఇందులో జే హ్యూన్ క్యారెక్టర్ ఏంటీ? షెన్బా కొరియాలో జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తిరిగి ఆమె ఇండియాకు వచ్చిందా? అన్నది మేడ్ ఇన్ కొరియా సినిమాలో చూడాల్సిందే.