Made In Korea OTT Review:కొరియాలో తీసిన ఫస్ట్ ఇండియన్ మూవీ-ఓజీ హీరోయిన్ ఎమోషనల్ డ్రామా-డైరెక్ట్‌గా ఓటీటీలో-ఎలా ఉందంటే
Made In Korea OTT Review: ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే ‘మేడ్ ఇన్ కొరియా’. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.
సినిమా : మేడ్ ఇన్ కొరియా

నటీనటులు : ప్రియాంక మోహన్, రిషికాంత్, పార్క్ హే జిన్, జే హ్యూన్ జాంగ్ తదితరులు
దర్శకుడు : రా కార్తీక్
నిర్మాత : శ్రీనిధి సాగర్
ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్ : మార్చి 12, 2026
ఓజీ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైన హీరోయిన్ ప్రియాంక మోహన్. ఆమె ఫస్ట్ టైమ్ చేసిన ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మేడ్ ఇన్ కొరియా’. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన మూవీ ఇది. ఇది డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ అయింది.
కొరియాలో షూటింగ్ చేసుకొన్న ఫస్ట్ ఇండియన్ మూవీ ‘మేడ్ ఇన్ కొరియా’ అని మూవీ టీమ్ చెప్తోంది. ఇక్కడి తమిళ కల్చర్ ను, అక్కడి కొరియా కల్చర్ ను ఈ సినిమాలో చూపించారు. తమిళ్ తో సహా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మేడ్ ఇన్ కొరియా మూవీ ఎలా ఉందో ఈ రోజు రివ్యూలో చూసేయండి.
మేడ్ ఇన్ కొరియా కథ
కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్ అంటే ఇండియన్ యూత్ కు అలవాటే. కొరియన్ సినిమాలు చూస్తూ, బీటీఎస్ మ్యూజిక్ వింటూ ఎంటర్ టైన్ అవుతారు. చిన్నప్పటి నుంచి కొరియా సినిమాలు చూసి, ఆ మ్యూజిక్ విని ఎలాగైనా అక్కడికి వెళ్లాలనుకున్న ఓ అమ్మాయి కథే ‘మేడ్ ఇన్ కొరియా’.
షెన్బా (ప్రియాంక మోహన్) తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయి. ఆమెకు కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్ అంటే పిచ్చి. ఎలాగైనా కొరియా వెళ్లాలని చిన్నప్పటి నుంచి కొరియన్ భాష నేర్చుకుంటుంది. కొరియా వాళ్లలాగే తినడం అలవాటు చేసుకుంటుంది. పెద్దయ్యాక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొరియా వెళ్దామని ప్లాన్ వేస్తుంది. కానీ చివర్లో ఆమె బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తాడు. అయినా ఒంటరిగానే ఆమె దక్షిణ కొరియాలోని సియోల్ సిటీకి వెళ్తుంది.
కొరియా చేరుకున్నాక ఆమెకు అక్కడ ఓ అబ్బాయి (పార్క్ హే జిన్) పరిచయం అవుతాడు. ఇంటి నుంచి తీసుకెళ్లిన డబ్బులు అయిపోయిన తర్వాత కొరియాలో షెన్బా ఏం చేసింది? ఇందులో జే హ్యూన్ క్యారెక్టర్ ఏంటీ? షెన్బా కొరియాలో జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తిరిగి ఆమె ఇండియాకు వచ్చిందా? అన్నది మేడ్ ఇన్ కొరియా సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ
కె డ్రామాలు, మ్యూజిక్ ఇష్టపడేవాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే మూవీ మేడ్ ఇన్ కొరియా. మిగతా ఆడియన్స కు కూడా నచ్చే మూవీ ఇది. కొరియాపై ఇష్టం పెంచుకుని అక్కడికి వెళ్లిన తర్వాత ఓ తమిళ అమ్మాయి పడే కష్టాలు, అక్కడి పరిస్థితులను మూవీలో చక్కగా చూపించారు. ముఖ్యంగా తమిళ కల్చర్, కొరియా కల్చర్ కు ఉండే తేడా, మనుషుల వ్యవహారశైలి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొరియా అబ్బాయితో హీరోయిన్ కెమిస్ట్రీ, అక్కడ ఓ పెద్దావిడతో ఎమోషనల్ బాండింగ్ బాగా వర్కౌట్ అయింది.
కొరియా వెళ్లాక ఆనందాన్ని మాత్రమే కాదు అంతకుమించిన అనుభూతిని షెన్బా అందుకుంటుంది. ట్రూ రిలేషన్ షిప్, ఎమోషనల్ బాండింగ్ గురించి ఆమెకు తెలుస్తుంది. మొత్తానికి మేడ్ ఇన్ కొరియా సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ. అయితే సెకండాఫ్ లో స్లో స్క్రీన్ ప్లే, ఊహకు తగ్గట్లుగా సాగే సీన్లు ఈ సినిమాకు మైనస్. కొరియాలోని స్టార్ యాక్టర్లను కూడా ఇందులో నటించేలా చేయడం హైలైట్ అని చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే?
మేడ్ ఇన్ కొరియా సినిమాను ప్రియాంక మోహన్ తన భుజాలపై నడిపించింది. ఆమెకు ఇదే ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబాటు కానీ కంగారు కానీ లేకుండా ఎంతో ఈజ్ గా చేసుకుంటూ పోయింది. తన నేచురల్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. కొరియా వెళ్లాలనే పట్టుదల ఉన్న అమ్మాయిగా, అక్కడికి వెళ్లిన తర్వాత కఠిన పరిస్థితులను ఎదుర్కొనే యువతిగా ఎంతో మెచ్యూరిటీతో యాక్టింగ్ చేసింది.
ఇక కొరియన్ హీరో పార్క్ కూడా తన యాక్టింగ్ తో సత్తాచాటాడు. ప్రియాంక, పార్క్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మరోవైపు నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కొరియాలోని ప్రదేశాలను చక్కగా చూపించారు.
ఫైనల్ గా
ఫైనల్ గా చెప్పాలంటే మేడ్ ఇన్ కొరియా ఓ ఫీల్ గుడ్ ఎమోషన్ సినిమా. కామెడీ, రొమాన్స్ కూడా ఉంటుంది. మంచి ఎమోషన్ పండింది. డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని మిస్ కావొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయంటే ఇది ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వీకెండ్ లో ఓటీటీ ఆడియన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ కావాలంటే ఈ మూవీపై లుక్కేయొచ్చు.
రేటింగ్: 3.5/5
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












