Madhavan: స్క్రీన్‌పై ఎక్కడా మీకు సిగరెట్ కనిపించదు.. సిక్కులంటే చాలా గౌరవం..: మాధవన్ వివరణ
Madhavan: ధురంధర్ 2లో సిక్కులను అవమానించారన్న వివాదంపై మాధవన్ స్పందించాడు. ఆ సీన్ ను చాలా జాగ్రత్తగా తెరకెక్కించామని, సిక్కులంటే తనకు చాలా గౌరవం అని చెబుతూ అతడు ఓ వీడియో రిలీజ్ చేశాడు.
బాలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ రీసెంట్‌గా డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ 2' సినిమాలో తను చేసిన ఒక సిగరెట్ సీన్ గురించి వస్తున్న వివాదంపై స్పందించాడు. సిక్కు కమ్యూనిటీని అగౌరవపరిచే ఉద్దేశం తమకు అస్సలు లేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో రణ్‌వీర్ సింగ్ క్యారెక్టర్‌తో మాట్లాడుతూ.. గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్రమైన దశమ్ గ్రంథ్ లోని పద్యం చదివే ముందే తను సిగరెట్ ఆర్పేశానని, స్క్రీన్ మీద ఎక్కడా పొగ కనిపించదని వివరించాడు. ఆ కమ్యూనిటీ మీద తనకు ఎంతో గౌరవం ఉందని చెబుతూ, అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరాడు.

మాధవన్ ఏమన్నాడంటే..
మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో మెసేజ్ ద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. నమస్కారం, నేను ఆర్ మాధవన్. ధురంధర్ సినిమా టీమ్ అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్. మీరు మా సినిమాకు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే, మా ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అయితే ఈ సినిమాలో నేను గురు గోవింద్ సింగ్ రాసిన దశమ్ గ్రంథ్ లోని కొన్ని లైన్స్ చదువుతున్నప్పుడు సిగరెట్ తాగానని, ఆ సీన్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని మాకు తెలిసింది అని మాధవన్ చెప్పుకొచ్చాడు.
షూటింగ్ టైమ్‌లో తీసుకున్న జాగ్రత్తలు ఇవే..
ఈ సీన్ షూట్ చేసేటప్పుడు చిత్ర బృందం తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా మాధవన్ వివరంగా చెప్పాడు. ఈ సీన్ చేసేటప్పుడు ఆ పవిత్రమైన డైలాగ్ చెప్పే ముందే ఆదిత్య ధర్ నాకు కొన్ని కచ్చితమైన సూచనలు చేశాడు. నాకంటే కూడా ఆయనే ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకుంటాడు. ఆ పవిత్రమైన లైన్స్ చెప్పడానికి చాలా ముందే సిగరెట్ ఆర్పేయాలని ఆయన నాకు చెప్పాడు. డైలాగ్ చెప్పేటప్పుడు నా నోటి నుంచి పొగ రాకూడదని, స్క్రీన్ మీద కూడా ఎక్కడా పొగ కనిపించకూడదని ఆయన స్ట్రిక్ట్‌గా చెప్పాడు. అంతేకాదు ఆ పద్యం మాకు ఎంతో పవిత్రమైనది కాబట్టి, ఆ డైలాగ్ చెప్పే టైమ్‌లో కనీసం నా చేతిలో సిగరెట్ కూడా ఉండకూడదని ఆదిత్య ముందే ప్లాన్ చేశాడు అని మాధవన్ క్లియర్ గా చెప్పాడు.
ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తా
సిక్కు కమ్యూనిటీ అందరికీ మేం ఎప్పుడూ అండగా ఉంటామని, వాళ్లంటే మాకు విపరీతమైన గౌరవం ఉందని మాధవన్ అన్నాడు. నిజానికి నా ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను పర్సనల్‌గా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తాను, ఈ విషయం అందరికీ తెలిసిందే అని అతడు గుర్తుచేశాడు. కాబట్టి తెలిసీ తెలియక ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో మేం కచ్చితంగా ఈ పని చేయలేదు. అందరూ హ్యాపీగా ఉంటూ ధురంధర్ 2 సినిమాను ఎంజాయ్ చేయండి అని మాధవన్ ఆ వీడియోను ముగించాడు.
అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే..
మహారాష్ట్రలోని సిక్కుల ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, శివసేన షిండే వర్గానికి చెందిన నాయకుడు గురుజ్యోత్ సింగ్ కీర్ ఈ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు. ధురంధర్ 2 లోని ఆ సీన్ సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించాడు.
గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్రమైన దశమ్ గ్రంథ్ లోని పద్యం చదువుతూ, మాధవన్ క్యారెక్టర్ సిగరెట్ తాగడం తమకు చాలా కోపం తెప్పించిందని ఆయన ఫైర్ అయ్యాడు. దీనిపై మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా మేకర్స్ మీద పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
ధురంధర్ 2 సినిమా డీటెయిల్స్..
డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలోకి వచ్చి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, సారా అర్జున్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


