బ్రేకింగ్‌.. జ‌న నాయ‌గ‌న్‌కు సెన్సార్ స‌ర్టిఫికేట్-సెన్సార్ బోర్డుకు మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాలు-మ‌రి రిలీజ్ ఎప్పుడు ?

బ్రేకింగ్.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. 

Published on: Jan 9, 2026, 11:01:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికేట్ పై ఓ క్లారిటీ వచ్చింది. శుక్రవారం (జనవరి 9) మద్రాస్ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. u/a సెర్టిఫికేట్ ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది.

జన నాయగన్ లో విజయ్ దళపతి
జన నాయగన్ లో విజయ్ దళపతి

జన నాయగన్ పై హైకోర్టు

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి అప్ కమింగ్ మూవీ ‘జన నాయగన్’. తెలుగులో దీన్ని జన నాయకుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ మూవీని జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. ఈ రోజు మద్రాస్ హై కోర్టు తీర్పు వెల్లడించింది.

యు/ఏ సర్టిఫికేట్

జన నాయగన్ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ పై ఇవాళ మద్రాస్ హై కోర్టు తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి యు/ఏ (u/a) సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును మద్రాస్ హై కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో జన నాయగన్ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ రానుంది.

అసలు ఏమైందంటే?

రాజకీయ పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ దళపతి యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్తున్నారు. అతని లాస్ట్ సినిమా జన నాయగన్. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వలేదు. సినిమా నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి తక్షణమే తీర్పు కోరగా, ఈ విషయంపై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

రివ్యూ కమిటీకి

జస్టిస్ పీటీ ఆశ నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించారు. విచారణ సందర్భంగా సీబీఎఫ్సీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేషన్, సినిమాను పరిశీలించిన ప్యానెల్ సభ్యులలో ఒకరు దాఖలు చేసిన ఫిర్యాదు కాపీని సమర్పించారు. కొన్ని సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం ఉందని పునఃపరిశీలనలో తేలినట్లయితే, ఒక సినిమాను రివ్యూ కమిటీకి పంపే అధికారం బోర్డుకు ఉందని ఆయన అన్నారు.

రిలీజ్ ఎప్పుడు?

జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హై కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి ఈ రోజు మూవీ రిలీజ్ కావాల్సింది. మరి ఇప్పుడు కొత్త డేట్ పై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఇదే నెలలోనే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More