Mahakali: ‘ది ఎండ్ బిగిన్స్’..సంచలన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'మహాకాళి' నుంచి బిగ్ అప్‌డేట్..ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ

Mahakali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న ఫస్ట్ లేడీ సూపర్‌హీరో చిత్రం 'మహాకాళి' నుంచి అదిరే అనౌన్స్ మెంట్ వచ్చింది. అక్షయ్ ఖన్నా పోస్టర్‌తో ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్.

Published on: Aug 19, 2026, 14:21:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahakali: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU)ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి లేడీ సూపర్‌హీరో చిత్రం 'మహాకాళి' (Mahakali) గురించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన తాజా అప్‌డేట్‌ను విడుదల చేశారు.

‘ది ఎండ్ బిగిన్స్’..సంచలన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'మహాకాళి' నుంచి బిగ్ అప్‌డేట్..ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ (x/PrasanthVarma)
‘ది ఎండ్ బిగిన్స్’..సంచలన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'మహాకాళి' నుంచి బిగ్ అప్‌డేట్..ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ (x/PrasanthVarma)

మహాకాళి అప్ డేట్

పూజా కొల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహాకాళి సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అక్షయ్ ఖన్నాను చూపిస్తూ ఉన్న ఈ పోస్టర్‌పై “ది ఎండ్ బిగిన్స్” (The End Begins) అనే క్యాప్షన్‌ను జత చేశారు.

గ్లింప్స్ రిలీజ్ డేట్

ఈ పోస్టర్ తో మహాకాళి గ్లింప్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 24, 2026న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త బయటకు రావడంతోనే ప్రశాంత్ వర్మ అభిమానులతో పాటు విభిన్నమైన సినిమాలను ఆదరించే సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సుకత నెలకొంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రశాంత్ వర్మ కథతో

పశ్చిమ బెంగాల్ సంస్కృతి, అక్కడి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మహాకాళి చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను అందించారు. ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ రమేష్ దుగ్గల్ అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరన్ సాయి స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రబృందం ఈ భారీ సోషియో-ఫాంటసీ సూపర్‌హీరో చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.

మరో ప్రయోగం

ప్రశాంత్ వర్మ రాసిన ఈ శక్తివంతమైన కథను పూజా కొల్లూరి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయుల ఆధ్యాత్మికత, శక్తి స్వరూపిణి భావనను ఆధునిక సూపర్‌హీరో కథనానికి జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భూమి శెట్టి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో ఒక కీలకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

సంక్రాంతి రేసులో 'మహాకాళి'

ఇప్పటికే 'హనుమాన్' సినిమా సంక్రాంతికి వచ్చి ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 'మహాకాళి'ని కూడా 2027 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 24న రాబోయే గ్లింప్స్ ద్వారా ఈ సినిమా విజువల్స్, కాన్సెప్ట్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో స్పష్టత రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More