...
...
Next Story

OTT Release: వారాహి అమ్మవారి శాపం.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవల్!

OTT Release: ఓటీటీలో అదిరిపోయే మిస్టరీ, ఉత్కంఠతో ఊపేసే థ్రిల్లర్ కోసం చూస్తున్న ఆడియన్స్ కు గుడ్ న్యూస్. లేటెస్ట్ గా థియేటర్లలో రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Oct 1, 2026, 14:46:27 IST
Advertisement

OTT Release: అక్కినేని హీరో సుమంత్ లేటెస్ట్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) ఓటీటీలోకి వచ్చేస్తోంది. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది.

మహేంద్రగిరి వారాహి ఓటీటీ

వారాహి అమ్మవారి శాపం.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవల్!
వారాహి అమ్మవారి శాపం.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవల్!

సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజైన ‘మహేంద్రగిరి వారాహి’ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు కేవలం మూడు వారాల వ్యవధిలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోకి అడుగుపెడుతోంది. రేపటి నుంచి (అక్టోబర్ 2, 2026) తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

3 వారాల్లోనే ఓటీటీలోకి

​కార్తికేయ 2, సుబ్రహ్మణ్యపురం తరహాలో డివైన్ మిస్టరీ కాన్సెప్ట్‌తో రూపొందిన 'మహేంద్రగిరి వారాహి' చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. విభిన్నమైన కథాంశంతో వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని వేగంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు మొగ్గు చూపారు.

​థియేట్రికల్ రన్ పూర్తయిన కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా ఐదు ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. థియేటర్లలో మిస్ అయిన సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ ప్రియులకు ఈ చిత్రం ఓటీటీలో మంచి ఆప్షన్‌గా మారనుంది.

సుమంత్ తో పాటు

​గతంలో సుమంత్‌తో 'సుబ్రహ్మణ్యపురం' లాంటి డివోషనల్ థ్రిల్లర్ తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి.. ఈసారి వారాహి అమ్మవారి నేపథ్యంతో ఈ కథను నడిపించారు. అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం పాత్రలు ఈ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.

స్టోరీ ఏంటంటే?

యూట్యూబర్ అయిన సిద్ధార్థ్ (సుమంత్) మూఢ నమ్మకాల పేరుతో జనాలను మోసం చేస్తున్న దొంగ బాబాల వీడియోలు తీస్తుంటాడు. దేవుడు, దెయ్యాలను అతను నమ్మడు. అయితే సిద్ధార్థ్ బ్రదర్ రాజీవ్ కు ఓ దోషం ఉంటుంది.

సిద్ధార్థ్ ఫ్యామిలీ అంతా కలిసి మహేంద్రగిరిలోని వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ రాజీవ్ చనిపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అమ్మవారి శాపం ఏంటీ? హీరో నిజాలను ఎలా బయటకు తీశాడన్నదే మూవీ స్టోరీ. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవల్ ఉంటుంది. సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ కు మహేంద్రగిరి వారాహి మూవీ మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks