Mahesh Babu: అబ్బాయ్‌తో బాబాయ్‌.. ఒక్క ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్‌.. అన్న కొడుకు సినిమాకు మ‌హేష్ బాబు ఫుల్ స‌పోర్ట్‌.. హైప్

Mahesh Babu: తన సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' యూనిట్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వయంగా కలిసి అభినందించారు. దీంతో మహేష్ బాబు సపోర్ట్ చేయడం లేదంటూ వస్తున్న పుకార్లకు ఒక్క ఫోటోతో చెక్ పడింది.

Published on: Jul 28, 2026, 14:21:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahesh Babu: ఘట్టమనేని కాంపౌండ్ నుంచి మరొక యంగ్ హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). అయితే అన్న కొడుకు సినిమాకు మహేష్ బాబు సపోర్ట్ లేదనే రూమర్లు వచ్చాయి.

అబ్బాయ్‌తో బాబాయ్‌.. ఒక్క ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్‌.. అన్న కొడుకు సినిమాకు మ‌హేష్ బాబు ఫుల్ స‌పోర్ట్‌.. హైప్ (x/VyjayanthiFilms)
అబ్బాయ్‌తో బాబాయ్‌.. ఒక్క ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్‌.. అన్న కొడుకు సినిమాకు మ‌హేష్ బాబు ఫుల్ స‌పోర్ట్‌.. హైప్ (x/VyjayanthiFilms)

రూమర్లకు చెక్

'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) శ్రీనివాస మంగాపురం చిత్రానికి డైరెక్చటర్. ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక్క ఫొటోతో మహేష్ బాబు సపోర్ట్ లేదనే రూమర్లకు మూవీ టీమ్ చెక్ పెట్టింది.

స్పెషల్ ఫోటో

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ప్రచారం గట్టిగా సాగింది. ఇప్పటివరకు 'శ్రీనివాస మంగాపురం' ప్రమోషనల్ ఈవెంట్లలో గానీ, ప్రీ-రిలీజ్ వేడుకల్లో గానీ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఎక్కడా కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి.

శ్రీనివాస మంగాపురం సినిమాకు లేదా జయకృష్ణ ఎంట్రీకి మహేష్ బాబు సపోర్ట్ చేయడం లేదనే ఊహాగానాలు షికారు చేశాయి. అయితే, ఈ రూమర్లన్నింటికీ స్వయంగా మహేష్ బాబు ఒక్క ఫోటోతో చెక్ పెట్టాడు.

బాబాయ్ తో అబ్బాయ్

తాజాగా మహేష్ బాబును జయకృష్ణ, డైరెక్టర్ అజయ్ భూపతి కలిశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకుంటూ, జయకృష్ణ డెబ్యూ పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు మహేష్ బాబు. జూలై 30న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని హృదయపూర్వక ఆశీస్సులు అందించాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాబాయిగా ఎప్పుడూ ముందే

నిజానికి ఘట్టమనేని కుటుంబంలో ఎవరి కొత్త ప్రాజెక్ట్ వచ్చినా మహేష్ బాబు వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటాడు. తన అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కెరీర్ పట్ల మహేష్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడని, కేవలం ప్రమోషన్లలో ముందుగా కనిపించనంత మాత్రాన సపోర్ట్ లేదనుకోవడం పొరపాటని ఈ ఫొటోతో స్పష్టమైంది.

ఆ వీడియోతో

ఇప్పటికే శ్రీనివాస మంగాపురం సినిమాను ఆదరించాలని ఓ స్పెషల్ వీడియో ద్వారా ఫ్యాన్స్ ను మహేష్ బాబు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి మార్క్ మేకింగ్, ఘట్టమనేని వారసుడి ఎంట్రీ కాంబినేషన్‌లో వస్తున్న 'శ్రీనివాస మంగాపురం' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వయంగా ఆశీస్సులు అందించడం, ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేయడంతో ఘట్టమనేని అభిమానుల్లో జోష్ రెట్టింపైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More