మహేష్ బాబు మేనకోడలు జాన్వీ తెలుసా? టాలీవుడ్ లో నటిగానూ పేరుగాంచిన మహేష్ అక్క మంజుల కూతురు ఈమె. కొన్నాళ్ల కిందట ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడామె సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతోంది. ఈ విషయాన్ని మంజులే వెల్లడించిండి.
హీరోయిన్‌గా మంజుల కూతరు జాన్వీ

టాలీవుడ్ లోకి మరో నట వారసురాలు వస్తోంది. అది కూడా ఘట్టమనేని వంశం నుంచి కావడం విశేషం. దివంగత సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేన కోడలు, నటి మంజుల కూతురు అయిన జాన్వీ స్వరూప్ తెరంగేట్రం ఖాయమైంది. బుధవారం (అక్టోబర్ 29) ఆమె బర్త్ డే సందర్భంగా మంజుల చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
“నా ముద్దుల కూతురు జాన్వీ స్వరూప్.. బాగా పెద్దదైంది.. తనదైన జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.. ఆమె తనతోపాటు ఓ ప్రకాశవంతమైన వారసత్వాన్ని వెంట తీసుకొస్తోంది.. ఇప్పుడిక వెలగడం ఆమె వంతు. ఆమె మ్యాజిక్, ఆమె టాలెంట్, ఆమె మనసుపై నాకు నమ్మకం ఉంది. నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిని ప్రపంచం చూడటానికి సిద్ధంగా ఉంది. నా డార్లింగ్.. నీ కోసం స్క్రీన్, ఈ ప్రపంచం వేచి చూస్తోంది. ఐ లవ్యూ సో మచ్.. హ్యాపీ బర్త్ డే మై జాను” అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాలో మంజుల పోస్ట్ చేసింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
మంజుల చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. మీ అమ్మాయి అచ్చూ హీరోయిన్ లా ఉందంటూ కొందరు అభిమానులు కామెంట్ చేశారు. ఆమె చాలా అందంగా ఉందని, స్క్రీన్ పై చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఓ అభిమాని అన్నారు. హ్యాపీ బర్త్ డే జాన్వీ అంటూ ఎంతో మంది ఆమెకు విషెస్ చెప్పారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ మంజుల మరోసారి కామెంట్స్ సెక్షన్ లో స్పందించింది.
54 ఏళ్ల వయసున్న మంజు సూపర్ స్టార్ కృష్ణ కూతురు. రమేష్ బాబు, మహేష్ బాబు ఆమె సోదరులు. సంజయ్ స్వరూప్ ను ఆమె పెళ్లి చేసుకుంది. కావ్యాస్ డైరీ, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్ లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా 2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించింది. 2018లో వచ్చిన మనసుకు నచ్చింది అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది.
{{/usCountry}}54 ఏళ్ల వయసున్న మంజు సూపర్ స్టార్ కృష్ణ కూతురు. రమేష్ బాబు, మహేష్ బాబు ఆమె సోదరులు. సంజయ్ స్వరూప్ ను ఆమె పెళ్లి చేసుకుంది. కావ్యాస్ డైరీ, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్ లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా 2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించింది. 2018లో వచ్చిన మనసుకు నచ్చింది అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది.
{{/usCountry}}