...
...
Next Story

Mahesh Babu Scene Review: ఇదో మస్ట్ వాచ్.. సూర్య సీన్ మూవీకి మహేష్ బాబు రివ్యూ.. కూల్, స్మార్ట్, సోమచ్ ఫన్ అంటూ..

Mahesh Babu Scene Review: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ వర్సటైల్ యాక్టర్ సూర్య నటించిన సరికొత్త చిత్రం 'ది సీన్' (The Scene) పై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీ చూసిన మహేష్.. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. ఇదో మస్ట్ వాచ్ అని అన్నారు.

Published on: Nov 9, 2026, 18:40:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Mahesh Babu Scene Review: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. భాషతో సంబంధం లేకుండా టాలెంట్ ఎక్కడున్నా, సినిమా బాగుంటే మనస్ఫూర్తిగా ప్రశంసించడం ఆయనకు అలవాటు. తాజాగా తమిళ వర్సటైల్ హీరో సూర్య , నజ్రియా, నస్లేన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 'ది సీన్' (The Scene) సినిమా చూసిన మహేష్ బాబు.. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. సినిమా ఎంతో కూల్‌గా, తెలివిగా, వినోదాత్మకంగా ఉందంటూ చిత్ర బృందాన్ని మహేష్ బాబు అభినందించారు.

సూర్య నటనపై మహేష్ ప్రశంసల వర్షం

Mahesh Babu Scene Review: ఇదో మస్ట్ వాచ్.. సూర్య సీన్ మూవీకి మహేష్ బాబు రివ్యూ.. కూల్, స్మార్ట్, సోమచ్ ఫన్ అంటూ..
Mahesh Babu Scene Review: ఇదో మస్ట్ వాచ్.. సూర్య సీన్ మూవీకి మహేష్ బాబు రివ్యూ.. కూల్, స్మార్ట్, సోమచ్ ఫన్ అంటూ..

మహేష్ బాబు తన పోస్ట్‌లో రాస్తూ.. "ది సీన్ సినిమా చూశాను, చాలా నచ్చింది. ఎంతో కూల్, స్మార్ట్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్. 'ఇన్బరాజ్' (Inbaraj) పాత్రలో సూర్య ఫైర్‌లా జీవించేశారు. నజ్రియా, నస్లేన్ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు" అని కొనియాడారు.

సూర్య వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు కాగా, ఈ సినిమాలో ఆయన పోషించిన 'ఇన్బరాజ్' పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు ప్రత్యేకంగా ఆ పాత్రను ప్రస్తావించడంతో సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

దర్శకుడు జిత్తు మాధవన్ మేకింగ్‌కు హ్యాట్సాఫ్

'రోమాంచమ్', 'ఆవేశం' వంటి సంచలన విజయాల తర్వాత దర్శకుడు జిత్తు మాధవన్ (Jithu Madhavan) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జిత్తు మాధవన్ దర్శకత్వ ప్రతిభను, స్క్రీన్‌ప్లేని మహేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

"జిత్తు మాధవన్ రైటింగ్ చాలా బ్రిలియంట్‌గా ఉంది. ఆయన ఎగ్జిక్యూషన్ ఎక్సలెంట్" అని మహేష్ బాబు పేర్కొన్నారు. "సినిమాలోని ప్రతి సాంకేతిక విభాగం ఎంతో ఇంప్రెసివ్‌గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం" అని ముగించారు.

నెట్టింట మహేష్ బాబు ట్వీట్ వైరల్

మహేష్ బాబు అందించిన ఈ గ్రాండ్ ప్రశంసతో 'ది సీన్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ బిజినెస్ మరియు వ్యూవర్షిప్ లభించే అవకాశం ఉంది.

ది సీన్ మూవీ స్టోరీ ఏంటంటే?

ఇన్బరాజ్ (సూర్య) క్రైమ్ బ్రాంచ్‌లో ఒక బ్రిలియంట్ డిటెక్టివ్. అయితే అనూహ్యంగా అతనికి కంటిచూపు పూర్తిగా పోతుంది. ఈ విషయాన్ని ప్రపంచానికి రహస్యంగా ఉంచి, ప్రశాంతంగా ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒకప్పుడు ఇన్బరాజ్ జైలుకు పంపిన 'పర్ఫ్యూమ్ సీరియల్ కిల్లర్' క్రైమ్ స్టైల్‌ను కాపీ కొడుతూ ఈశ్వరన్ (నస్లెన్) అనే సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు.

దీంతో కళ్లు లేని ఇన్బరాజ్ మళ్లీ బలవంతంగా ఫీల్డ్‌లోకి దిగాల్సి వస్తుంది. అంధుడైన ఇన్బరాజ్ అసలు ఈశ్వరన్‌ను ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది సీన్ మూవీ మిగతా కథ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks