Gautam Rating: నాని ‘ది ప్యారడైజ్’ పై మహేష్ బాబు కొడుకు సంచలన రివ్యూ.. రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Gautam The Paradise Review and Rating: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని సినిమా రివ్యూలు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమాకు ఆయన ఇచ్చిన వన్ స్టార్ రేటింగ్, నెగటివ్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gautam The Paradise Review and Rating: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు 20 ఏళ్లు నిండిన తర్వాత, తన ఇన్స్టాగ్రామ్ బయోలో 'లెటర్ బాక్స్' (Letterboxd) ఐడీని యాడ్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఇచ్చే సినిమా రివ్యూలు, రేటింగ్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కేవలం ఇతర హీరోల సినిమాలకే కాకుండా, తన తండ్రి సినిమాలకు కూడా ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా జెన్యూన్ గా రేటింగ్స్ ఇస్తుండటం విశేషం.

నాని "ది ప్యారడైజ్" కు షాకింగ్ రేటింగ్
తాజాగా గౌతమ్ ఘట్టమనేని రివ్యూ చేసిన చిత్రం నేచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్'. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ మూవీని చూసిన గౌతమ్.. లెటర్ బాక్స్ లో కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి గౌతమ్ కు నాని నటించిన 'జెర్సీ' సినిమా అంటే చాలా ఇష్టం. కానీ ఈ కొత్త సినిమా మాత్రం అతడిని తీవ్రంగా నిరాశపరిచింది.
చాలా డిజప్పాయింట్
ది ప్యారడైజ్ సినిమాపై గౌతమ్ తన రివ్యూ రాసుకొచ్చాడు. "సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సన్నివేశాల్లో నటీనటుల యాక్టింగ్ నాకు బాగా నచ్చాయి. కానీ వాటిని మినహాయిస్తే సినిమాలో నాకు ఇంకేమీ నచ్చలేదు. ఈ సినిమా నన్ను చాలా డిజప్పాయింట్ చేసింది. అలాగే మూవీ ఎడిటింగ్ అయితే మరీ దారుణంగా ఉంది" అని గౌతమ్ తన రివ్యూలో కుండబద్దలు కొట్టినట్లు పేర్కొన్నాడు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

నెట్టింట మొదలైన చర్చ
గౌతమ్ సినిమా అభిరుచిని చాలా మంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సినిమా బాగుంటే బాగుందని, బాలేకపోతే బాలేదని నిర్మొహమాటంగా చెప్పే ఆయన తీరుని అభినందిస్తున్నారు. నాని సినిమాకు గౌతమ్ ఇంత తక్కువ రేటింగ్ ఇవ్వడం బహుశా ఇదే తొలిసారి. ఏదేమైనా గౌతమ్ ఇచ్చిన ఈ రివ్యూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) తదితర ప్లాట్‌ఫామ్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
తండ్రి సినిమాలకు సైతం జెన్యూన్ గా..
గౌతమ్ కేవలం ఇతరుల సినిమాలనే కాదు, తన తండ్రి సినిమాలను కూడా చాలా నిశితంగా విశ్లేషిస్తుంటాడు. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమాకు గౌతమ్ 2.5 స్టార్స్ మాత్రమే ఇచ్చాడు. అదే సమయంలో నాని నటించిన కొన్ని సినిమాలకు మహేష్ సినిమాల కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చాడు.
దీన్ని బట్టి చూస్తే అతనికి సినిమాల పట్ల ఉన్న జెన్యూన్ టేస్ట్ అర్థమవుతోందని, ఆయన ఏ హీరోకు ఫ్యాన్ కాకుండా కంటెంట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాక్సిక్ కు ఇలా
గతంలో కన్నడ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' సినిమాకు కూడా గౌతమ్ కేవలం 0.5 స్టార్ రేటింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. స్టార్ కిడ్స్ కేవలం భజన చేయకుండా, కంటెంట్ ను బట్టి తమ అభిప్రాయాలను సూటిగా చెప్పడం ప్రస్తుతం ఉన్న యువతకు బాగా కనెక్ట్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


