శ్రీనివాసన్ కు కన్నీటి వీడ్కోలు పలికిన మోహన్ లాల్.. ఓదార్చిన మమ్ముట్టి.. వీడియో వైరల్.. ఏమైందంటే?

ప్రముఖ మలయాళ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు శ్రీనివాసన్ డిసెంబర్ 20న 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల స్టార్ నటుడు మోహన్ లాల్ ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్న అతన్ని మమ్ముట్టి ఓదార్చారు. ఈ వీడియో వైరల్ గా మారింది. 

Published on: Dec 20, 2025, 18:57:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడిగా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా పేరుగాంచిన సీనియర్ మలయాళ స్టార్ శ్రీనివాసన్ శనివారం (డిసెంబర్ 20) మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ ప్రియమైన సినిమా దిగ్గజానికి నివాళులు వెల్లువెత్తాయి. అనేకమంది స్టార్లు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఎమోషనల్ అయిన మోహన్ లాల్
ఎమోషనల్ అయిన మోహన్ లాల్

మోహన్ లాల్ కన్నీరు

శ్రీనివాసన్‌తో కలిసి అనేక చిత్రాల్లో నటించారు మోహన్‌లాల్, మమ్ముట్టి. శ్రీనివాసన్ మరణం పట్ల వీళ్లు తీవ్రమైన ఎమోషనల్ కు గురయ్యారు. కేరళలోని శ్రీనివాసన్ నివాసానికి మృతదేహాన్ని తరలించినప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి అక్కడే ఉన్నారు. శ్రీనివాసన్ నివాసంలో సంతాపం తెలిపేందుకు వచ్చిన అభిమానుల సందోహాన్ని చూసి మోహన్‌లాల్ కంటతడి పెట్టారు. పక్కనే కూర్చున్న మమ్ముట్టి ఆయన్ని ఓదార్చారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

20 సినిమాల్లో

మోహన్‌లాల్, శ్రీనివాసన్ కలిసి 20 చిత్రాల్లో నటించారు. వారి అత్యంత ప్రియమైన చిత్రాలలో కొన్ని 'చంద్రలేఖ' (1997), 'కిలిచుందన్ మాంబళం' (2003), 'నాడువడిక్కట్టు' (1987). తన ఫేస్‌బుక్ ఖాతాలో మోహన్‌లాల్ శ్రీనివాసన్ జ్ఞాపకార్థం ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు.

చెప్పకుండానే

'శ్రీని, చెప్పకుండానే వెళ్ళిపోయాడు. శ్రీనితో నా బంధాన్ని మాటల్లో ఎలా వర్ణించాలో నాకు తెలియదు. మేము కలిసి పనిచేసిన వాళ్ళకు అతీతంగా మా ప్రేమ అనుబంధం ఉండేది. శ్రీనితో ప్రతి మలయాళీకి ఉన్న అనుబంధం అలాంటిదే. శ్రీని సృష్టించిన పాత్రలలో మలయాళీలు తమ ముఖాన్ని చూసుకున్నారు’’ అని మోహన్ లాల్ పేర్కొన్నారు.

నవ్వుల్లో బాధను

‘‘తెరపై అతని ద్వారా నా బాధలు, సంతోషాలు, లోపాలను చూశాను. మధ్యతరగతి ప్రజల కలలు, పీడకలలను శ్రీనిలా ఎవరు వర్ణించగలరు? మనం కలిసి పోషించిన పాత్రలు, శ్రీని రచనల్లోని మాయాజాలం వల్లనే ఎప్పటికీ నిలిచిపోతాయి. దాసన్, విజయన్ వంటి పాత్రలు శ్రీని అద్భుతమైన రచనా నైపుణ్యం వల్ల ప్రతి మలయాళీకి తమ వాళ్ళయ్యారు.

అతని సృష్టలు సమాజానికి అద్దం పట్టాయి. నవ్వుల్లో బాధను పట్టుకున్న ప్రియమైనవాడు. తెరపై, జీవితంలో దాసన్, విజయన్ లాగా నవ్వుతూ, సరదాగా గొడవ పడుతూ, కలిసి మెలిసి తిరిగాము. ప్రియమైన శ్రీని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని మోహన్ లాల్ తెలిపారు. హాస్పిటల్ వర్గాల ప్రకారం శ్రీనివాసన్ డిసెంబర్ 20న ఉదయం సుమారు 8.30 గంటలకు మరణించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More