లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే దిలీప్ కొత్త సినిమా 'భ భ బ' (Bha Bha Ba) ప్రమోషన్లలో స్టార్ హీరో మోహన్‌లాల్ భాగస్వామ్యం కావడంపై ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి మద్దతు ఇవ్వాల్సిన పెద్దలే ఇలా చేయడం "బాధ్యతారాహిత్యం" అని ఆమె మండిపడింది.
అసలు ఏం జరిగిందంటే?

కేరళలో సంచలనం సృష్టించిన నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో డిసెంబర్ 8న కోర్టు నటుడు దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే దిలీప్ నటిస్తున్న 'భ భ బ' (భయం భక్తి బహుమానం) సినిమా ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.
అయితే తీర్పు వచ్చిన వెంటనే మోహన్‌లాల్ ఈ సినిమా పోస్టర్లను, ప్రమోషనల్ కంటెంట్‌ను షేర్ చేయడంపై వివాదం రాజుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో పాల్గొన్న సీనియర్ నటి భాగ్యలక్ష్మి.. మోహన్‌లాల్ తీరును తప్పుబట్టింది.
"ఇది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే.."
మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మోహన్‌లాల్‌పై విరుచుకుపడింది. మోహన్‌లాల్ చర్యను ఆమె సున్నితత్వం లేని, ఆలోచన లేని చర్యగా అభివర్ణించింది.
"తీర్పు వచ్చిన వెంటనే ఆ సినిమా పోస్టర్‌ను షేర్ చేయడానికి ముందు మోహన్‌లాల్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? గతంలో ఆ బాధితురాలి కోసం ప్రార్థిస్తున్నానని ఆయన చాలాసార్లు చెప్పారు. అంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? ఇది కేవలం సినిమా విషయం కాదు.. ఇది నైతికతకు సంబంధించిన విషయం" అని ఆమె ప్రశ్నించింది.
మంజు వారియర్‌పై దిలీప్ కామెంట్స్
నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత దిలీప్ ప్రవర్తనను కూడా భాగ్యలక్ష్మి విమర్శించింది. "బయటకు రాగానే ఆయన మీడియా ముందు పండుగ చేసుకున్నట్లు మాట్లాడారు. విచారణకు సహకరించిన తన మాజీ భార్య మంజు వారియర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ బాధితురాలు ధైర్యంగా ముందుకు రాకపోయి ఉంటే.. మంజు వారియర్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది" అని భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించింది.
భాగ్యలక్ష్మి రాజీనామా
{{/usCountry}}నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత దిలీప్ ప్రవర్తనను కూడా భాగ్యలక్ష్మి విమర్శించింది. "బయటకు రాగానే ఆయన మీడియా ముందు పండుగ చేసుకున్నట్లు మాట్లాడారు. విచారణకు సహకరించిన తన మాజీ భార్య మంజు వారియర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ బాధితురాలు ధైర్యంగా ముందుకు రాకపోయి ఉంటే.. మంజు వారియర్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది" అని భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించింది.
భాగ్యలక్ష్మి రాజీనామా
{{/usCountry}}తీర్పు తర్వాత దిలీప్‌ను తిరిగి అసోసియేషన్‌లో చేర్చుకోవాలని 'ఫెఫ్కా' (FEFKA) నిర్ణయించింది. ఈ నిర్ణయానికి, ఇండస్ట్రీలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలకు నిరసనగా భాగ్యలక్ష్మి ఇప్పటికే ఫెఫ్కా సభ్యత్వానికి రాజీనామా చేసింది.
2017లో ప్రముఖ నటిని కారులో కిడ్నాప్ చేసి వేధించారు. ఈ కేసులో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత డిసెంబర్ 8న దిలీప్ నిర్దోషిగా విడుదలయ్యాడు. దిలీప్ విడుదలను సవాలు చేస్తూ పై కోర్టుకు వెళ్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.