...
...
Next Story

OTT Malayalam: ఓటీటీలోకి తెలుగులో మలయాళం థ్రిల్లర్ మూవీ.. మళ్లీ మళ్లీ పెళ్లి.. శోభనం ఆపే తోకచుక్క.. టైమ్ లూప్ థ్రిల్లర్

OTT Malayalam: మలయాళంలో వినూత్న టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన 'ధూమకేతు' (Dhoomakethu) మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతోంది. సజిన్ గోపు, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రేపటి నుంచి అంటే అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Oct 22, 2026, 18:25:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Malayalam: సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌లను కామెడీతో మేళవించి తెరకెక్కించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుంది. వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకునే మాలీవుడ్ చిత్రాలకు తెలుగు ఓటీటీ ప్రియుల్లోనూ విశేష ఆదరణ ఉంది. అదే కోవలో సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చి ఆకట్టుకున్న వైవిధ్యభరితమైన టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు' (Dhoomakethu). థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమైంది.

OTT Malayalam: ఓటీటీలోకి తెలుగులో మలయాళం థ్రిల్లర్ మూవీ.. మళ్లీ మళ్లీ పెళ్లి.. శోభనం ఆపే తోకచుక్క.. టైమ్ లూప్ థ్రిల్లర్
OTT Malayalam: ఓటీటీలోకి తెలుగులో మలయాళం థ్రిల్లర్ మూవీ.. మళ్లీ మళ్లీ పెళ్లి.. శోభనం ఆపే తోకచుక్క.. టైమ్ లూప్ థ్రిల్లర్

దర్శకుడు సుధీ మాడిసన్ (Sudhi Maddison) తెరకెక్కించిన ఈ వినూత్న చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొనుగోలు చేసింది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ధూమకేతు.. శోభనం ఆపే తోకచుక్క

మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'ధూమకేతు' స్టోరీ అంతా కుట్టన్ (సజిన్ గోపు) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. షర్మిల (నిఖిలా విమల్) అనే యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న కుట్టన్‌కి, తన పెళ్లి రోజే ఒక భయంకరమైన పీడకల వస్తుంది. తాను దారుణంగా హత్యకు గురైనట్లు అతనికి కల వస్తుంది.

అయితే తీరా నిద్ర లేచాక పెళ్లి పనులు ప్రారంభం కాగానే, అంతకు ముందు జరిగిన ఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లు అతనికి అనిపిస్తుంది (Deja vu). కేరళపై నుంచి వెళ్లే ఓ తోకచుక్క ఈ టైమ్ లూప్ కు కారణమవుతుంది. తను ఒక టైమ్-లూప్‌లో చిక్కుకున్నానని, ప్రతీ రాత్రి తను చనిపోతూ మళ్లీ అదే రోజు ఉదయానికి చేరుకుంటున్నానని అతను గ్రహిస్తాడు.

ఈ ధూమకేతు చిత్రంలో సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించగా.. గణపతి, మంజు పిళ్లై, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. సాంకేతిక విభాగంలో అంకిత్ మీనన్ సంగీతాన్ని అందించగా, జింటో జార్జ్ ఛాయాగ్రహణం, వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.

ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి సానుకూల ప్రశంసలు దక్కినప్పటికీ, ఈ చిత్రం థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. దాదాపు రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. సాధారణంగా టైమ్-లూప్ కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్‌ను సంక్లిష్టంగా మార్చకుండా, ఇందులోని కామెడీ ఎలిమెంట్స్, మిస్టరీ డ్రామాను ప్రధానంగా హైలైట్ చేస్తూ దర్శకుడు సుధీ మాడిసన్ దీనిని రక్తికట్టించారు.

డిజిటల్ వేదికపై ఈ టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్‌కు విశేష ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. వీకెండ్‌లో మైండ్ బ్లాకింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్ చూడాలనుకునే తెలుగు ఓటీటీ ప్రియులకు 'ధూమకేతు' మంచి ఛాయిస్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks