మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో ఏ సినిమా వచ్చినా ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పుడు అమోజ్ అలెగ్జాండర్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈవారమే స్ట్రీమింగ్ కానుంది. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అమోజ్ అలెగ్జాండర్ ఓటీటీ రిలీజ్

ప్రముఖ మలయాళ నటుడు అజు వర్గీస్, తారా అమల జోసెఫ్, జాఫర్ ఇడుక్కిలాంటి వాళ్లు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమోజ్ అలెగ్జాండర్ (Amoz Alexander). ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రాబోతోంది.
“కొన్ని మిస్టరీలను ఛేదించలేరు.. వాటికవే బయటపడతాయి. అమోజ్ అలెగ్జాండర్ ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో సన్ నెక్ట్స్ ఓటీటీ ట్వీట్ చేసింది.
అమోజ్ అలెగ్జాండర్ మూవీ విశేషాలు
జాఫర్ ఇడుక్కి, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘అమోజ్ అలెగ్జాండర్’. ఒక జర్నలిస్ట్, కరుడుగట్టిన నేరస్తుడి మధ్య జరిగే సైకలాజికల్ ఫైట్ గా తెరకెక్కింది. అజయ్ షాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది నవంబర్ 14న విడుదలైంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మేరీ ఫిలిప్ (తారా అమలా జోసెఫ్) ఒక క్రైమ్ జర్నలిస్ట్. ఆమె తన కెమెరామెన్ జాన్ (అజు వర్గీస్)తో కలిసి అమోజ్ అలెగ్జాండర్ (జాఫర్ ఇడుక్కి) అనే ఒక కరుడుగట్టిన నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. అయితే ఆ ఇంటర్వ్యూ సాధారణంగా సాగదు.
తాను చేసినవి మాత్రమే కాకుండా.. బయట ప్రపంచానికి తెలియని మరిన్ని భయంకరమైన నేరాలను కూడా ఒప్పుకుంటానని అమోజ్ చెప్పడంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆ ఇంటర్వ్యూ కాస్తా వారి ముగ్గురి మధ్య ఒక ప్రమాదకరమైన, డార్క్ సైకలాజికల్ వార్‌గా మారుతుంది.
{{/usCountry}}తాను చేసినవి మాత్రమే కాకుండా.. బయట ప్రపంచానికి తెలియని మరిన్ని భయంకరమైన నేరాలను కూడా ఒప్పుకుంటానని అమోజ్ చెప్పడంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆ ఇంటర్వ్యూ కాస్తా వారి ముగ్గురి మధ్య ఒక ప్రమాదకరమైన, డార్క్ సైకలాజికల్ వార్‌గా మారుతుంది.
{{/usCountry}}ఈ మూవీలో టైటిల్ రోల్‌లో జాఫర్ ఇడుక్కి తనదైన నటనతో భయపెట్టాడు. అజు వర్గీస్ సీరియస్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. మినీబాయ్ సంగీతం, ప్రమోద్ కె పిళ్లై సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేశాయి.
విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇది ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ అని, జాఫర్ ఇడుక్కి నటన, విజువల్స్ బాగున్నాయని ప్రశంసించారు. అయితే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.