...
...
Next Story

ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మెగాస్టార్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించింది.

Published on: Dec 29, 2025, 21:02:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలంకావల్ (Kalamkaval). ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా నెల రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ వెల్లడించింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం.

కలంకావల్ ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మెగాస్టార్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మెగాస్టార్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళంలో ఈ ఏడాది రిలీజైన మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ కలంకావల్. మమ్ముట్టి ఓ ఎస్సై పాత్రలో నటించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ ను జనవరిలో చేయనున్నట్లు సోనీ లివ్ వెల్లడించింది. డేట్ చెప్పకపోయినా.. జనవరి 2నే ఈ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

“లెజెండ్ మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా తిరిగి వస్తున్నాడు. మీకు ఊపిరి ఆడనంతగా మమ్ముట్టి నటన ఉండబోతోంది. ఈ సీజన్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కలంకావల్ ఈ జనవరిలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. ఇది మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

కలంకావల్ మూవీ గురించి..

మలయాళం నుంచి వచ్చే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే మన ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తే. ఆ కోవలోకి చెందిన లేటెస్ట్ సినిమానే 'కలంకావల్'. ఈ సినిమా నిజ జీవితంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ 'సయనైడ్ మోహన్' కథ ఆధారంగా రూపొందించారు.

కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లి, వారిని సయనైడ్ ఇచ్చి హత్య చేసే ఒక కిల్లర్ కథ ఇది. ఇందులో మమ్ముట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న 'స్టాన్లీ దాస్' అనే సీరియల్ కిల్లర్ పాత్రలో నటించగా, అతడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ 'జయకృష్ణన్' పాత్రలో వినాయకన్ నటించారు. మమ్ముట్టి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

బాక్సాఫీస్ వసూళ్లు

ఈ సినిమా ఒక నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగే ఇన్వెస్టిగేషన్, మమ్ముట్టి-వినాయకన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకు హైలైట్. మమ్ముట్టి గతంలో 'మున్నారియిప్పు' వంటి చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రలు చేసినా, ఇందులో అతని క్రూరత్వం కొత్తగా ఉంటుందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe