ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే
ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి.అవేంటో ఇక్కడ చూడండి.
క్రిస్మస్ వీకెండ్ (డిసెంబర్ 27-28) సందర్భంగా ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. హిందీలో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హర్షవర్ధన్ రాణే సినిమా 'ఏక్ దీవానే కి దీవానియత్', తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మిడిల్ క్లాస్', తెలుగు మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా సహా కన్నడ, మలయాళ సినిమాలు ఇందులో ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో రకరకాల జానర్స్ సందడి చేస్తున్నాయి. ఒకవైపు పిచ్చెక్కిించే ప్రేమకథ, మరోవైపు మిడిల్ క్లాస్ కష్టాలు, ఇంకోవైపు హారర్ థ్రిల్లర్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ వీకెండ్ మీరు చూడదగ్గ టాప్ మూవీస్ ఇవే.
ఆంధ్రా కింగ్ తాలూకా - నెట్‌ఫ్లిక్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా ఈవారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటే ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. హీరో కోసం పడిచచ్చే ఓ వీరాభిమాని చుట్టూ తిరిగే కథ ఇది.
ఏక్ దీవానే కి దీవానియత్ - జీ5 ఓటీటీ
మన తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితుడైన హర్షవర్ధన్ రాణే నటించిన ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. విమర్శకులు దీన్ని 'టాక్సిక్ లవ్ స్టోరీ' అని విమర్శించినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా దుమ్ములేపింది. ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ బ్యూటీ సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటించింది.
మిడిల్ క్లాస్ - జీ5 ఓటీటీ
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఒక సామాన్యుడి కథ. భార్య, ఇద్దరు పిల్లలతో కష్టాలు పడే కార్ల్ మార్క్స్ అనే వ్యక్తికి అనుకోకుండా రూ. కోటి చెక్ దొరుకుతుంది. ఆ చెక్ వాళ్ళ కష్టాలు తీరుస్తుందా? లేక కొత్త తలనొప్పులు తెస్తుందా? మునీష్‌కాంత్, విజయలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమాలో మధ్యతరగతి కష్టాలను నవ్విస్తూనే కళ్లకు కట్టారు.
ఐ యామ్ గాడ్ (కన్నడ) - సన్ నెక్ట్స్ ఓటీటీ
ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. కాలేజీ టాపర్ దేవా, బిందుల ప్రేమకథ ఒకవైపు.. మరోవైపు ముసుగు వేసుకున్న ఓ హంతకుడు చేసే హత్యలు ఇంకోవైపు. ఈ రెండింటికీ లింక్ ఏంటి అన్నదే సస్పెన్స్. రవి గౌడ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కి మంచి ఛాయిస్.
నిధియుమ్ భూతవుమ్ (మలయాళం) - సన్ నెక్ట్స్ ఓటీటీ
ఈ మూవీ టైటిల్ అర్థం 'నిధి, భూతం'. ముగ్గురు కుర్రాళ్లు తమ మెకానిక్ షాపును ఒక పాత భవనంలోకి మారుస్తారు. అక్కడ దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఎదురైన భయానక అనుభవాలే ఈ సినిమా. సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


