OTT: మలయాళం సినిమాలే కాదు ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా వరుసగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నిజానికి మార్చి 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ చూసే వీలు కలిగింది.
జీ5 ఓటీటీలో కాసరగోడ్ ఎంబసీ

ఫేక్ పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా చుట్టూ తిరిగే కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ మార్చి 20న మలయాళంలో స్ట్రీమింగ్ కు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలోనూ 7.4 రేటింగ్ నమోదైంది. దీంతో ఇతర భాషల్లోనూ మేకర్స్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తొలి ఎపిసోడ్ ను ఫ్రీగా చూసే అవకాశం కూడా కల్పించారు. నేరుగా జీ5 లేదా ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.
కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ స్టోరీ ఇదే
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాసరగోడ్ ఎంబసీ ఓ నకిలీ పాస్‌పోర్ట్ తయారీ ముఠా చుట్టూ తిరుగుతుంది. 2000వ దశకం నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్.. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో జరిగే నకిలీ పాస్‌పోర్ట్ వ్యాపారాన్ని కళ్లకు కట్టేలా చూపించింది. అజి, చెమ్ము అనే ఇద్దరు యువకులు ఈ అక్రమ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు? అసలు కంటే మెరుగ్గా ఉండేలా నకిలీ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులను వీరు ఎలా సృష్టిస్తారు? అనేది ప్రధానాంశం.
ఈ వెబ్ సిరీస్ ట్రైలర్లో చూపించినట్లుగా.. "కాగితం మీద ముద్రించే ఏదైనా సరే.. అది సర్టిఫికెట్ అయినా, పాస్‌పోర్ట్ అయినా.. అసలును మించి డూప్లికేట్‌ను సృష్టించవచ్చు" అని ఒక మహిళా పాత్ర చెప్పే డైలాగ్ ఈ రాకెట్ లోతును తెలియజేస్తోంది. ఈ అక్రమ కార్యకలాపాలను ఛేదించేందుకు పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్, దానికి అడ్డుపడే విలన్ల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటమే ఈ వెబ్ సిరీస్.
కాసరగోడ్ ఎంబసీ విశేషాలు
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్ ట్రైలర్లో చూపించినట్లుగా.. "కాగితం మీద ముద్రించే ఏదైనా సరే.. అది సర్టిఫికెట్ అయినా, పాస్‌పోర్ట్ అయినా.. అసలును మించి డూప్లికేట్‌ను సృష్టించవచ్చు" అని ఒక మహిళా పాత్ర చెప్పే డైలాగ్ ఈ రాకెట్ లోతును తెలియజేస్తోంది. ఈ అక్రమ కార్యకలాపాలను ఛేదించేందుకు పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్, దానికి అడ్డుపడే విలన్ల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటమే ఈ వెబ్ సిరీస్.
కాసరగోడ్ ఎంబసీ విశేషాలు
{{/usCountry}}కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ ను అతీష్ డైరెక్ట్ చేశాడు. ఈ వెబ్ సిరీస్‌లో 'మార్కో' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, అబు సలీమ్, గోవింద్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుధీష్, దీపక్ పరంబోల్, రోనీ డేవిడ్, దినేష్ ప్రభాకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హీరాజ్ పీహెచ్ ఈ సిరీస్‌కు కథ అందించగా, రతీష్ వేగ సంగీతం సమకూర్చారు.