OTT: ఓటీటీలోకి మలయాళ సోషియో ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ.. థియేటర్లను వణికించిన సినిమా.. 7.6 రేటింగ్
OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు సీక్రెట్ ఆఫ్ కళింగ. జులై 24 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.
OTT: థియేటర్లలో ఆడియన్స్‌కు వెన్నులో వణుకు పుట్టించిన రీసెంట్ మలయాళ సోషియో ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ 'సీక్రెట్ ఆఫ్ కళింగ' (Secret of Kalinga) డిజిటల్ రిలీజ్‌కు టైం ఫిక్స్ చేసుకుంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ జులై 24 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హోమ్ స్క్రీన్స్ పై డిజిటల్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి రెడీ అయిపోయింది.

డైరెక్టర్ సనీష్ విజువల్ మ్యాజిక్..
ఈ మలయాళ థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ సినిమాను డైరెక్టర్ సనీష్ ఉన్నికృష్ణన్ ఎంతో ఇంటెన్స్‌గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. జిష్ణు ఎమ్. ఆర్యన్ తో కలిసి ఆయన రాసిన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. అశ్రిత్ సంతోష్ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగా.. ధనుష్ హరికుమార్, విమల్‌జిత్ విజయన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి.
హీరో ధ్యాన్ శ్రీనివాసన్ తో పాటు అల్తాఫ్ సలీం, రియాజ్ ఖాన్, మాళవిక మీనన్, మెరీనా మైఖేల్, లక్ష్మి నందన్, గౌరీ నంద కీలక పాత్రల్లో నటించారు. ఉల్లాస్ పంతళం, సనీష్ ఉన్నికృష్ణన్, ఆదర్శ్ వినోద్ కూడా తమ యాక్టింగ్ పవర్‌ను చూపించారు. ఐరా ఫిలిమ్స్ బ్యానర్‌పై బషీర్ వరంథరపల్లి, సుల్తాన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. గోకుల్ శ్రీకందన్ అడిషనల్ సాంగ్స్ కంపోజ్ చేయగా, అఖిల్ రాయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.
అటు పల్లిచట్టంబి.. ఇటు సీక్రెట్ ఆఫ్ కళింగ
సన్ నెక్స్ట్ తన మలయాళం మూవీ లైబ్రరీని భారీగా పెంచే పనిలో పడింది. 'సీక్రెట్ ఆఫ్ కళింగ' తో పాటు విష్ణు ఉన్నికృష్ణన్ లీడ్ రోల్‌లో కిరణ్ నారాయణన్ డైరెక్ట్ చేసిన 'రివాల్వర్ రింకో' సినిమాను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో లాలు అలెక్స్, బిను శశిధరన్, విజిలేష్, సంజు శివరామ్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక జులై 24న ఓటీటీ వరల్డ్ లో ఒక బిగ్ ఫైట్ జరగబోతోంది. టోవినో థామస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ డ్రామా 'పల్లిచట్టంబి' అదే రోజున సోనీ లివ్ (SonyLIV) లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో వస్తోంది. వరల్డ్‌వైడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నౌఫల్, బ్రిజేష్ తో పాటు సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చాణక్య, చైతన్య, చరణ్ దీనిని నిర్మించారు. ఎస్. సురేష్ బాబు స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమాకు టోవినో థామస్ లుక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఒకటి కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో షేరింగ్ బేసిస్ మీద వస్తుండటంతో.. ఈ సీక్రట్ ఆఫ్ కళింగ సినిమా కూడా వేరే యాప్స్ లో వస్తుందా అని ఆడియన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ మిస్టరీ థ్రిల్లర్ డిజిటల్ రైట్స్ ని కేవలం సన్ నెక్స్ట్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇండియా వెలుపల ఉన్న ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం వేరే ప్లాట్‌ఫామ్స్ ఏవీ దీనిని స్ట్రీమింగ్ చేయడం లేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


