హారర్ కామెడీ మూవీ అనగానే ఓ దెయ్యం.. భయపెడుతూనే నవ్వించే నెరేటివ్.. ఇవే గుర్తుకు వస్తాయి. కానీ మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya) మాత్రం దీనికి పూర్తి భిన్నమైనది. ఓ క్యూట్ దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకునే సినిమా ఇది.
సర్వం మాయ స్టోరీ ఏంటంటే?

సర్వం మాయ శుక్రవారమే (జనవరి 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను అఖిల్ సత్యన్ డైరెక్ట్ చేశాడు. నివిన్ పాలీ లీడ్ రోల్లో నటించగా.. రియా షిబు ఇందులో డెలెలు అనే దెయ్యం పాత్రలో అదరగొట్టింది. అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ కూడా కీలకపాత్రలు పోషించారు.
ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రభేందు నంబూద్రి అనే ఓ యువకుడు, అనుకోకుండా ఓ దెయ్యంతో అతడు చేసే స్నేహం చుట్టూ తిరుగుతుంది. ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా నాస్తికవాదిగా మారి, గొప్ప గిటారిస్ట్ కావాలనుకునే ప్రభేందు.. అనుకోని పరిస్థితుల్లో పూజలు పునస్కారాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే ఓ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి వెళ్లి ఆ దెయ్యాన్ని తన వెంట తీసుకొస్తాడు.
ఆ క్యూట్ ఆడ దెయ్యం అతనితో స్నేహం చేస్తుంది. ఆమెకు డెలెలు అనే పేరు పెడతాడు. వీళ్ల స్నేహం ఎంత వరకూ వెళ్లింది? అది అతని కెరీర్ కు ఎలా తోడ్పడింది? అసలు ఆ దెయ్యం ఎవరు? అతని వెంట ఎందుకు పడింది అన్నదే ఈ సర్వం మాయ మిగిలిన కథ.
సర్వం మాయ ఎలా ఉందంటే?
సాధారణంగా హారర్ కామెడీ అనగానే ఓ భయపెట్టే దెయ్యం, దాని చుట్టూ అల్లుకునే కామెడీయే గుర్తుకు వస్తుంది. కానీ సర్వం మాయ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం అనేదే కొత్త కాన్సెప్ట్. అందులోనూ ఆ దెయ్యం ఓ క్యూట్ అమ్మాయి అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
{{/usCountry}}సాధారణంగా హారర్ కామెడీ అనగానే ఓ భయపెట్టే దెయ్యం, దాని చుట్టూ అల్లుకునే కామెడీయే గుర్తుకు వస్తుంది. కానీ సర్వం మాయ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం అనేదే కొత్త కాన్సెప్ట్. అందులోనూ ఆ దెయ్యం ఓ క్యూట్ అమ్మాయి అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
{{/usCountry}}నిజానికి మూవీలో నివిన్ ది లీడ్ రోల్ అయినా.. డెలెలు పాత్ర పోషించిన రియా షిబునే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మూవీ సాగుతున్న కొద్దీ ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం కథ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది అన్న విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.
చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా..
ఇక సినిమా మొత్తం సరదాగా సాగిపోయినా.. చివరి 20 నిమిషాలు మాత్రం ఎమోషనల్ అవుతాం. ముఖ్యంగా డెలెలు ఫ్లాష్‌బ్యాక్, ఆమె చనిపోయిన తీరు కంటతడి పెట్టిస్తుంది. అసలు అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి దెయ్యంగా ఎలా మారిందన్నది హీరో తెలుసుకునే విధానాన్ని కూడా డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది.
నివిన్ పాలీ, రియా షిబు, అజు వర్గీస్ నటన సినిమాకు హైలైట్. మ్యూజిక్, బీజీఎం కూడా బాగుంది. మొత్తంగా ఈ సర్వం మాయ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఓ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.