Today OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్-గతం మర్చిపోయిన దెయ్యం-సాయం చేసే యువకుడు-8 రేటింగ్
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ సర్వం మాయ ఓటీటీలోకి వచ్చేసింది. గతం మర్చిపోయిన దెయ్యానికి యువకుడు సాయం చేసే స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.147 కోట్లు వసూలు చేసింది.
మలయాళ సినిమాలకు తెలుగులోకూ మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడి థ్రిల్లర్లు, హారర్ థ్రిల్లర్లు, ఫీల్ గుడ్ మూవీస్ ను తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో మలయాళ మూవీ ‘సర్వం మాయ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (జనవరి 30) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

సర్వం మాయ ఓటీటీ
మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ ప్లే చేసిన హారర్ కామెడీ మూవీ ‘సర్వం మాయ’. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ సర్వం మాయ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏడు భాషల్లో
మలయాళ సినిమా సర్వం మాయ సినిమా ఓటీటీలో ఏకంగా ఏడు భాషల్లో అందుబాటులో ఉంది. జియోహాట్‌స్టార్ లో నేటి నుంచి మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో సర్వం మాయ మూవీని చూడొచ్చు. దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ ఉండటం విశేషం.
బ్లాక్ బస్టర్
సర్వం మాయ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.147 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇది మలయాళ హీరో నివిన్ పౌలీ కెరీర్ లో ఫస్ట్ రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా. ఇందులో నివిన్, రియా షిబు, అజు వర్గీస్ తదితరులు నటించారు. ఇది డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది. దీనికి అఖిల్ సత్యన్ డైరెక్టర్.
సర్వం మాయ స్టోరీ
ప్రభేందు (నివిన్ పౌలీ) ఓ బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన యువకుడు. కానీ నాస్తికుడు. దేవుళ్లంటే పెద్దగా నమ్మడు. పైగా తండ్రితో గొడవలు. దీంతో ఇంటికి దూరంగా ఉంటాడు. గిటారిస్ట్ కావాలని కల కంటాడు. యూరోప్ వెళ్లాలని అనుకుంటాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఇవేమీ సాధ్యం కావు.
దెయ్యాన్ని కలిసి
వీసా పొందడంలో ఫెయిల్ కావడంతో ప్రభేందు తన కజిన్ రూపేష్ (అజు వర్గీస్) అనే పూజారి దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. వీళ్లు ఒక ఇంట్లో దెయ్యాన్ని వదిలించే పూజ చేయాల్సి వస్తుంది. అక్కడే కథలో మలుపు. మాయ (రియా షిబు) అనే ఆడ దెయ్యం ప్రభేందుకు మాత్రమే కనిపిస్తుంది. ప్రభేందు వెంట పడుతుంది.
గతం మర్చిపోయి
మాయకు తాను ఎలా చనిపోయిందని, తన గతం ఏమీ గుర్తు ఉండదు. అందుకే ప్రభేందు ఈ దెయ్యానికి డెలూలు అని పేరు పెడతాడు. దెయ్యం తన గతం తెలుసుకోవడానికి సాయం చేస్తాడు. మరి మాయకు గతం గుర్తుకొచ్చిందా? ఈ క్రమంలో ప్రభేందు జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందన్నది సర్వం మాయ సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


