OTT Releases: ఈవారం ఓటీటీలోకి వస్తున్న ఈ 4 తెలుగు, మలయాళం సినిమాలను మిస్ కావద్దు.. ఓ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ కూడా

ఈ వారం డిజిటల్ తెరపై వినోదాల విందు మామూలుగా లేదు. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుండగా.. సౌత్ సినిమాలు కూడా పోటీకి సిద్ధమయ్యాయి. మరి వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన నాలుగు తెలుగు, మలయాళ సినిమాలేవో చూడండి.

Published on: Jan 27, 2026, 14:33:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈవారం వస్తున్న అతిపెద్ద సినిమా ధురంధర్. ఇండియన్ సినిమాలో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ఇది. జనవరి 30న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా.. దానికి పోటీగా నాలుగు తెలుగు, మలయాళం సినిమాలూ వస్తున్నాయి.

OTT Releases: ఈవారం ఓటీటీలోకి వస్తున్న ఈ 4 తెలుగు, మలయాళం సినిమాలను మిస్ కావద్దు.. ఓ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ కూడా
OTT Releases: ఈవారం ఓటీటీలోకి వస్తున్న ఈ 4 తెలుగు, మలయాళం సినిమాలను మిస్ కావద్దు.. ఓ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ కూడా

మలయాళ నటుడు నివిన్ పాలీ నటించిన బ్లాక్‌బస్టర్ ‘సర్వం మాయ’ ఒకవైపు, యువ తెలుగు కథానాయకుడు రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ మరోవైపు సిద్ధంగా ఉన్నాయి. జనవరి చివరి వారంలో జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో విడుదల కానున్న మలయాళ, తెలుగు సినిమాలేవో తెలుసుకోండి.

సర్వం మాయ (Sarvam Maya) - జియోహాట్‌స్టార్

గతేడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో బ్లాక్‌బస్టర్ ‘సర్వం మాయ’. ఇది ప్రభేందు అనే సంగీతకారుడి కథ. సంగీతంలో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అతను.. ఇంటికి తిరిగి వచ్చి బ్రతుకు తెరువు కోసం మతపరమైన ఆచారాలు, పూజలు చేయడం ప్రారంభిస్తాడు.

అలాంటి ఒక పూజ తర్వాత ఒక దెయ్యం అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ దెయ్యం రాకతో అతని జీవితం అనూహ్యంగా మారిపోతుంది. మంచి హారర్ కామెడీ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్. శుక్రవారం (జనవరి 30) నుంచి జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

ఛాంపియన్ (Champion) - నెట్‌ఫ్లిక్స్

రోషన్ మేక నటించిన ఛాంపియన్ గురువారం (జనవరి 29) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు మూవీ మనల్ని 1940ల నాటి కాలానికి తీసుకెళ్తుంది. ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కనే ఒక యువకుడి కథ ఇది. అలాంటి వ్యక్తి తన భూమిని కాపాడుకోవడానికి చేసే పెద్ద పోరాటంలో ఎలా చిక్కుకున్నాడనేది ఇందులో చూపించారు.

ఇందులో మలయాళ నటి అనస్వర రాజన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలోని ‘గిర గిర గిర’ అనే పాట యువతను బాగా ఆకట్టుకుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఆడకపోయినా, ఓటీటీలో ఆదరణ పొందే అవకాశం ఉంది.

కానిస్టేబుల్ (Constable) - ఈటీవీ విన్

‘హ్యాపీ డేస్’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నటుడు వరుణ్ సందేశ్. అతడు ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించాడు. తన మేనకోడలు దారుణ హత్యకు గురైన తర్వాత, న్యాయం కోసం పోరాడే పోలీస్ అధికారిగా వరుణ్ చాలా నిజాయితీగా నటించాడు.

మధులిక వారణాసి ఇందులో కథానాయికగా నటించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. గురువారం (జనవరి 29) నుంచి ఈటీవీ విన్ టో చూడొచ్చు.

పతంగ్ (Patang) - సన్ నెక్స్ట్

ఇది మరో తెలుగు మూవీ. ముగ్గురు స్నేహితులు, గాలిపటాలు ఎగురవేయడంపై వారికి ఉన్న ఆసక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. స్నేహం, పోటీతత్వం కలగలిపిన ఒక రంగుల కథగా ఇది అలరించనుంది. ప్రణీత్ ప్రత్తిపాటి ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించాడు. శుక్రవారం (జనవరి 30) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More