Star Maa: మలయాళం నుంచి ఈ ఏడాది వచ్చిన అద్భుతమైన హారర్ కామెడీ మూవీ సర్వం మాయ. క్యూట్ దెయ్యంతో ఓ వ్యక్తి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే స్టోరీతో వచ్చిన ఈ సినిమా తెలుగు వాళ్లను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీకి సంబంధించి ప్రముఖ తెలుగు ఎంటర్టైన్‌మెంట్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేసింది.
సర్వం మాయ టీవీ ప్రీమియర్ వివరాలు

"కొన్ని కథలు ముగిసినా.. మనతోనే ఉండిపోతాయి" అంటూ స్టార్ మా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్వం మాయ మూవీ కేవలం కల్పిత కథగా కాకుండా, మనిషి జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను, బంధాలను ప్రతిబింబించేలా సాగుతుంది.
సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. దీంతో ఈ ఆదివారం (ఏప్రిల్ 19) సాయంత్రం 6 గంటల స్లాట్‌లో 'సర్వం మాయ' రానుంది. ఈ ఎమోషనల్ డ్రామాకు భారీ టీఆర్‌పీ (TRP) వస్తుందని స్టార్ మా భావిస్తోంది.
సర్వం మాయ ఎలా ఉందంటే?
సాధారణంగా హారర్ కామెడీ అనగానే ఓ భయపెట్టే దెయ్యం, దాని చుట్టూ అల్లుకునే కామెడీయే గుర్తుకు వస్తుంది. కానీ సర్వం మాయ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం అనేదే కొత్త కాన్సెప్ట్. అందులోనూ ఆ దెయ్యం ఓ క్యూట్ అమ్మాయి అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
నిజానికి మూవీలో నివిన్ ది లీడ్ రోల్ అయినా.. డెలులు పాత్ర పోషించిన రియా షిబునే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మూవీ సాగుతున్న కొద్దీ ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం కథ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది అన్న విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.
చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా..
{{/usCountry}}నిజానికి మూవీలో నివిన్ ది లీడ్ రోల్ అయినా.. డెలులు పాత్ర పోషించిన రియా షిబునే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మూవీ సాగుతున్న కొద్దీ ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం కథ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది అన్న విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.
చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా..
{{/usCountry}}ఇక సినిమా మొత్తం సరదాగా సాగిపోయినా.. చివరి 20 నిమిషాలు మాత్రం ఎమోషనల్ అవుతాం. ముఖ్యంగా డెలులు ఫ్లాష్‌బ్యాక్, ఆమె చనిపోయిన తీరు కంటతడి పెట్టిస్తుంది. అసలు అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి దెయ్యంగా ఎలా మారిందన్నది హీరో తెలుసుకునే విధానాన్ని కూడా డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది.
నివిన్ పాలీ, రియా షిబు, అజు వర్గీస్ నటన సినిమాకు హైలైట్. మ్యూజిక్, బీజీఎం కూడా బాగుంది. మొత్తంగా ఈ సర్వం మాయ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఓ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటికే జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఈ వీకెండ్ స్టార్ మాలో చూడొచ్చు. మరచిపోకండి.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'సర్వం మాయ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడు?
ఈ చిత్రం ఏప్రిల్ 19 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది.
2. సర్వం మాయ సినిమా ఏ జోనర్‌కు చెందినది?
'సర్వం మాయ' ప్రధానంగా ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సెంటిమెంట్‌తో కూడిన హారర్ కామెడీ మూవీ.
3. సర్వం మాయ సినిమాను ఆన్‌లైన్‌లో చూడవచ్చా?
స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ చిత్రాన్ని మీరు 'జియోహాట్‌స్టార్' యాప్‌లోనూ చూడొచ్చు.