...
...
Next Story

మ‌రో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి మ‌ల‌యాళ హార‌ర్ థ్రిల్ల‌ర్‌-మోహ‌న్ లాల్ త‌న‌యుడి న‌ట విశ్వ‌రూపం

మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. డైస్ ఇరే మూవీ ఇవాళ నుంచి ఇంకో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Dec 6, 2025, 15:12:12 IST
Advertisement

మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘డైస్ ఇరే’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మలయాళ థ్రిల్లర్ ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (డిసెంబర్ 6) నుంచి మరో ఓటీటీలోనూ ఇది ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

మరో ఓటీటీలోకి డైస్ ఇరే

మరో ఓటీటీలో మలయాళ హారర్ మూవీ (x)
మరో ఓటీటీలో మలయాళ హారర్ మూవీ (x)

మలయాళ హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. శనివారం నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం ఇండియా బయట వేరే దేశాల్లో ఉన్న ఆడియన్స్ కోసమే.

ఈ ఓటీటీల్లోనూ

అసలైన హారర్ తో భయపెట్టే డైస్ ఇరే ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రణవ్ మోహన్ లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) నుంచి జియోహాట్‌స్టార్‌తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

రూ.82 కోట్లు

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ నివేదికల ప్రకారం 'డైస్ ఇరే' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 82 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం భారతదేశంలో రూ.40.88 కోట్లు వసూలు చేయగా, విదేశీ మార్కెట్లలో సుమారు రూ. 33 కోట్లు సమకూర్చుకుంది. హాలోవీన్ సందర్భంగా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘డైస్ ఇరే’ ఎక్కువగా సానుకూల సమీక్షలను అందుకుంది.

మలయాళ మూవీ రికార్డు

ఆత్మ, ప్రతీకారం అనే అంశాల చూట్టూ సాగే సినిమానే డైస్ ఇరే. ఇందులో రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్ట్. అతనిది రిచ్ ఫ్యామిలీ. పేరేంట్స్ అమెరికాలో ఉంటారు. రోహన్ ఇక్కడ ఇండియాలో ఓ పెద్ద ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. ఒక రోజు అతని క్లాస్ మేట్ కని (నర్తకి) సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు.

కని రూమ్ లో ఉన్న ఓ రెడ్ కలర్ హెయిర్ క్లిప్ ను రోహన్ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అప్పటి నుంచే రోహన్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. ఏదో ఆత్మ తనను వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. అది కని ఆత్మ అని రోహన్ అనుకుంటాడు. కని బ్రదర్ కిరణ్ ఓ సారి రోహన్ ఇంటికి వస్తాడు. అతణ్ని పై అంతస్తు నుంచి కిందకు తోసేస్తుంది ఓ రహస్య శక్తి.

మరి ఆ ఆత్మ ఎవరు? కనిని ప్రేమించిన ఫిలిప్ కు ఈ కథకు సంబంధం ఏంటీ? క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks