ఓటీటీలోకి ఈవారం వస్తున్న మలయాళం సినిమాల్లో ఓ హారర్ థ్రిల్లర్ ఎంతో ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.82 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా పేరు డైస్ ఇరే (Dies Irae). మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
డైస్ ఇరే ఓటీటీ రిలీజ్ డేట్

ఈ ఏడాది ఎన్నో బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి ఈ హారర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఇరే. ఈ సినిమాను ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది. ఇప్పుడు ఐదు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుండటంతో ఓటీటీలో మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.
డైస్ ఇరే మూవీ గురించి..
ఆత్మ, ప్రతీకారం అనే అంశాల చూట్టూ సాగే సినిమానే డైస్ ఇరే. ఇందులో రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్ట్. అతనిది రిచ్ ఫ్యామిలీ. పేరేంట్స్ అమెరికాలో ఉంటారు. రోహన్ ఇక్కడ ఇండియాలో ఓ పెద్ద ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. ఒక రోజు అతని క్లాస్ మేట్ కని (నర్తకి) సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు.
కని రూమ్ లో ఉన్న ఓ రెడ్ కలర్ హెయిర్ క్లిప్ ను రోహన్ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అప్పటి నుంచే రోహన్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. ఏదో ఆత్మ తనను వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. అది కని ఆత్మ అని రోహన్ అనుకుంటాడు. కని బ్రదర్ కిరణ్ ఓసారి రోహన్ ఇంటికి వస్తాడు. అతన్ని పై అంతస్తు నుంచి కిందకు తోసేస్తుంది ఓ రహస్య శక్తి.
మరి ఆ ఆత్మ ఎవరిది? కనిని ప్రేమించిన ఫిలిప్ కు ఈ కథకు సంబంధం ఏంటీ? క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాను భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేయగా.. ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు.
{{/usCountry}}మరి ఆ ఆత్మ ఎవరిది? కనిని ప్రేమించిన ఫిలిప్ కు ఈ కథకు సంబంధం ఏంటీ? క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాను భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేయగా.. ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు.
{{/usCountry}}