మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ది ప్రొటెక్టర్' (The Protector). థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. మనోరమ మ్యాక్స్ (Manorama Max) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ది ప్రొటెక్టర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

మలయాళంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'ది ప్రొటెక్టర్' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. థియేటర్ రిలీజ్ సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ అతి త్వరలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
ది ప్రొటెక్టర్ కథేంటంటే..
ది ప్రొటెక్టర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది ఉత్తర మలబార్‌లోని 'మనక్కల్ మన' అనే పాడుబడిన భవంతి చుట్టూ తిరుగుతుంది. ఈ భవనం చుట్టూ అలుముకున్న రహస్యాలే ఈ సినిమా కథాంశం. బ్రిటీష్ కాలం నాటి నుంచి అక్కడ అనేక వింత కథలు ప్రచారంలో ఉంటాయి.
అయితే ఈ మధ్య కాలంలో అక్కడ జరిగిన కొన్ని ఘోరమైన విపత్తుల వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి సీఐ సత్య (షైన్ టామ్ చాకో) అక్కడికి వస్తాడు. ఆ మిస్టరీని సత్య ఎలా ఛేదించాడు? అక్కడ దాగి ఉన్న అసలు నిజాలేంటి? అనేదే ఈ సినిమా కథ. కాన్హంగాడ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.
ది ప్రొటెక్టర్ మూవీ నటీనటులు, ఇతర విశేషాల విషయానికి వస్తే.. జి.ఎం. మను (G M Manu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డయానా హమీద్ హీరోయిన్గా నటించింది. తలైవాసల్ విజయ్, మొట్టై రాజేంద్రన్, బోబన్ అలుమూడన్, ఉన్ని రాజా, మణికంఠన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జినోష్ ఆంటోనీ సంగీతం అందించాడు.
{{/usCountry}}ది ప్రొటెక్టర్ మూవీ నటీనటులు, ఇతర విశేషాల విషయానికి వస్తే.. జి.ఎం. మను (G M Manu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డయానా హమీద్ హీరోయిన్గా నటించింది. తలైవాసల్ విజయ్, మొట్టై రాజేంద్రన్, బోబన్ అలుమూడన్, ఉన్ని రాజా, మణికంఠన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జినోష్ ఆంటోనీ సంగీతం అందించాడు.
{{/usCountry}}