...
...
Next Story

ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్.. రోజుల వయసున్న పాప మిస్సింగ్ కేసు

ఓటీటీలోకి మరో మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. గత నెల 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. కేవలం 20 రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మధ్యే సర్వం మాయతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నివిన్ పాలీ నటించిన సినిమా ఇది.

Published on: Feb 5, 2026, 13:55:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళం మూవీ.. అందులోనూ థ్రిల్లర్ జానర్లో వస్తుందంటే ఎలా ఉన్నా ఓ కన్నేస్తారు తెలుగు ప్రేక్షకులు. అంతలా అక్కడి థ్రిల్లర్ సినిమాలు మన వాళ్లను ఆకట్టుకున్నాయి. ఓ సింపుల్ కథను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అక్కడి దర్శకులు చూపించే విధానం బాగుంటుంది. అలాంటిదే మరో మెడికల్ థ్రిల్లర్ మూవీ బేబీ గర్ల్ ఓటీటీలోకి వస్తోంది.

బేబీ గర్ల్ ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్.. రోజుల వయసున్న పాప మిస్సింగ్ కేసు
ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్.. రోజుల వయసున్న పాప మిస్సింగ్ కేసు

ఈ మధ్యే సర్వం మాయ అనే హారర్ కామెడీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరైన మలయాళ నటుడు నివిన్ పాలీ. అతడు లీడ్ రోల్లో నటించిన సినిమానే ఈ బేబీ గర్ల్. జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. 20 రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ఎక్స్ ద్వారా వెల్లడించింది.

“ఓ పాప్ మిస్సింగ్. అటెండెంట్ పారిపోవడం. నేరం కంటే దారుణమైన నిజం. నివిన్ పాలీ, లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ఈ హై టెన్షన్ థ్రిల్లర్ లో కీలకపాత్రలు పోషించారు. బేబీ గర్ల్ ఫిబ్రవరి 12 నుంచి కేవలం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళం వెర్షనే అందుబాటులోకి రానుంది.

బేబీ గర్ల్ మూవీ కథేంటంటే?

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ ప్రధాన పాత్రలో అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన మూవీ 'బేబీ గర్ల్'. హాస్పిటల్ నుంచి అదృశ్యమైన పసికందు చుట్టూ తిరిగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. ఇదంతా ఒక్క రోజులో జరిగే కథ. ఒక ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు అదృశ్యమవుతుంది. ఆ ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేసే సనల్ (నివిన్ పాలీ)కు, బిడ్డను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసుల వేట మొదలవుతుంది.

15 ఏళ్ల కిందట మలయాళంలోనే వచ్చిన ట్రాఫిక్ అనే మూవీ ఫార్మాట్ నే ఈ బేబీ గర్ల్ కోసం వాడారు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ అయినా.. ఈ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫస్టాఫ్ లోనే మూవీలోని థ్రిల్ ముగుస్తుంది. దీంతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ గేమ్ ఆడాడు దర్శకుడు. ఇది ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు.

గతేడాది చివర్లో సర్వం మాయ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నివిన్ పాలీకి ఈ బేబీ గర్ల్ మరోసారి నిరాశనే మిగిల్చింది. మరి ఈ మూవీ ఓటీటీలో ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe