...
...
Next Story

ఓటీటీలోని ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ చూశారా? ప్రెగ్నెంట్ లేడీస్ టార్గెట్.. వణికించే మూవీ.. 9.2 ఐఎండీబీ రేటింగ్

ఓటీటీలో ఓ మలయాళ సినిమా అదరగొడుతోంది. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో రిలీజైన ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

Published on: Nov 30, 2025, 16:20:15 IST
Advertisement

ఓటీటీలో మలయాళం సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇందులో థ్రిల్లర్లు అంటే వేరే లెవల్. అంతే కాకుండా హారర్ థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు అలాంటి ఓ మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమానే ‘ఎల్’.

ఎల్ మూవీ ఓటీటీ

ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ (youtube)
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ (youtube)

మలయాళ హారర్ థ్రిల్లర్ ‘ఎల్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 27 నుంచి మనోరమా మ్యాక్స్ లో అందుబాటులో ఉంది ఈ హారర్ థ్రిల్లర్. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. థియేటర్లో దీనికి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఏడాది తర్వాత

ఎల్ సినిమా 2024లో థియేటర్లలో రిలీజైంది. ఏప్రిల్ 5, 2024న థియేటర్లకు వచ్చింది. అప్పుడు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ హారర్ థ్రిల్లర్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఏడాది తర్వాత నవంబర్ 27, 2025 నుంచి మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ హారర్ థ్రిల్లర్. దీనికి ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉంది.

ఎల్ మూవీ కథ

ఎల్ సినిమా ఓ మలయాళ ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్. దీనికి శోజి సెబాస్టియన్ డైరెక్టర్. ఇందులో విష్ణు, అమృత మీనన్, బిగ్ బాస్-ఫేమ్ సంధ్య మనోజ్ తదితరులు నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ప్రెగ్నెంట్ లేడీస్ ను టార్గెట్ చేస్తుంటారు.

కేరళలోని వివిధ ప్రాంతాల్లో చనిపోయిన గర్భిణి స్ట్రీల కేసును రేణుక దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో ఈ హత్యల వెనుకు ఏదో మిస్టరీ ఉందని కనిపెడుతుంది. దీని వెనుక ఏదో భయంకరమైన శక్తి లేదా అసాధారణమైన హారర్ అంశం దాగి ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఆమె త్వరలోనే 1980లలో హంగేరీ, ఇతర దేశాలలో ఇలాంటి మరణాలు జరిగాయని కనుక్కుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks