...
...
Next Story

ఈవారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం మూవీస్, వెబ్ సిరీస్.. ఓ కొత్త థ్రిల్లర్ మూవీ కూడా..

ఓటీటీలో ఈవారం మలయాళం కంటెంట్ చాలానే ఉంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న వాటితోపాటు కొత్తగా ఓ థ్రిల్లర్ మూవీ కూడా రానుంది. వీటిని నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో చూడొచ్చు.

Published on: Mar 1, 2026, 20:44:56 IST
By
Prefer HTon Google
Advertisement

మలయాళ సినిమా అంటేనే వైవిధ్యానికి మారుపేరు. ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేస్తున్న సరికొత్త మలయాళ వెబ్ సిరీస్‌లు, సినిమాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నుంచి మనసును హత్తుకునే స్టోరీస్ వరకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మార్చి 2 నుంచి 8 వరకు స్ట్రీమ్ అవుతున్న టాప్ మలయాళ కంటెంట్ ఇదే.

సీక్రెట్ స్టోరీస్: రోజ్లిన్

ఈవారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం మూవీస్, వెబ్ సిరీస్.. ఓ కొత్త థ్రిల్లర్ మూవీ కూడా..
ఈవారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం మూవీస్, వెబ్ సిరీస్.. ఓ కొత్త థ్రిల్లర్ మూవీ కూడా..

స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్

ఒక టీనేజ్ అమ్మాయికి ఎదురయ్యే భయానక అనుభవాల నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది. పీడకలలతో సతమతమయ్యే ఆ బాలిక జీవితం చుట్టూ అల్లిన సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారు అస్సలు మిస్ కావద్దు. జియోహాట్‌స్టార్ లో గత వారమే స్ట్రీమింగ్ కు వచ్చింది.

ధీరం (Dheeram)

స్ట్రీమింగ్: సన్ నెక్స్ట్

ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ధీరం'. కన్నబిడ్డను కోల్పోయిన తండ్రికి న్యాయం చేసే క్రమంలో, ఒక పోలీస్ ఆఫీసర్ స్వయంగా తీర్పు ఇచ్చే జడ్జిగా, శిక్ష అమలు చేసే తలారిగా ఎలా మారాల్సి వచ్చిందనేది ఈ సినిమా కథ. భావోద్వేగాలతో కూడిన ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చే శుక్రవారం అంటే మార్చి 6న అడుగుపెడుతోంది.

ఖజురహో డ్రీమ్స్ (Khajuraho Dreams)

స్ట్రీమింగ్: సైనా ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇదొక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన సినిమా. విహారయాత్ర కోసం ఖజురహో వెళ్ళిన ఒక స్నేహితుల బృందం.. అక్కడి స్థానికుల సంక్షేమం కోసం ఒక మల్టీ నేషనల్ కంపెనీ, ప్రభుత్వంతో ఎలా పోరాడారనేది ఈ సినిమాలో చూడవచ్చు. కళ్లకు కట్టే విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇది సైనా ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

చథా పచ్చ (Chatha Pacha)

రోషన్ మాథ్యూ, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యాక్షన్ ప్రియులకు విందు భోజనంలా ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్స్ అంటే ఇష్టపడేవారికి ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ బాగా నచ్చుతాయి. చిన్నప్పుడు రెజ్లింగ్ చూసి ఎంజాయ్ చేసిన వారికి ఈ సినిమా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పాతిరాత్రి (Paathirathri)

స్ట్రీమింగ్: జీ5 (ZEE5)

ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ వెనుక ఉండే నిజమైన భావోద్వేగాలను ఈ సినిమా చూపిస్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్లుగా నవ్య నాయర్, సౌబిన్ షాహిర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. కథలోని మలుపులు, పోలీసుల వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలుపుతాయి. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe