ఓటీటీలోకి ఈవారం వస్తున్న నాలుగు ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

ఓటీటీలోకి ఈవారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతోంది. ఇక థియేటర్లలోనూ మరో సినిమా రిలీజ్ కానుంది. మరి ఆ సినిమాలు, సిరీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Dec 16, 2025, 19:40:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 మధ్య మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆసక్తికరమైన మూవీస్, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మమ్ముట్టి నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్, నివిన్ పాలీ తొలి వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తుండగా.. వివాదాల నడుమ దిలీప్, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఓటీటీ, థియేటర్లలో ఈ వారం మీరు చూడదగిన లేటెస్ట్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు ఇవే.

ఓటీటీలోకి ఈవారం వస్తున్న నాలుగు ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..
ఓటీటీలోకి ఈవారం వస్తున్న నాలుగు ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

ఫార్మా (Pharma) - జియోహాట్‌స్టార్

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ ఇది. దీనిని శుక్రవారం నుంచి అంటే డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఇదొక మెడికల్ థ్రిల్లర్. వైద్య రంగంలో జరిగే మోసాలు, అక్రమాలను ఈ సిరీస్ ద్వారా బట్టబయలు చేయనున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సిరీస్ ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ - జీ5

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స మూవీ జీ5 ఓటీటీలోకి డిసెంబర్ 19న అడుగుపెడుతోంది. మెగాస్టార్ మమ్ముట్టి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. డొమినిక్ అనే డిటెక్టివ్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తాడు. చిన్న కేసు అనుకుని మొదలుపెట్టి.. ఒక పెద్ద మిస్టరీలో చిక్కుకునే కథాంశం ఇది. గోకుల్ సురేష్ కీలక పాత్రలో నటించాడు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది.

బెస్టీ (Besty) - మనోరమ మ్యాక్స్

పెద్దగా తెలియని ఓ చిన్న మలయాళం సినిమా బెస్టీ. ఇప్పటికే ఈ మూవీ మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అపార్థాల వల్ల విడిపోయిన ఒక జంట కథ ఇది. ఆష్కర్ సౌదాన్, షహీన్ సిద్ధిక్ నటించారు. మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు.

భ భ బ (Bha Bha Ba) - థియేట్రికల్ రిలీజ్

ఈ గురువారం (డిసెంబర్ 18) ఈ భ భ బ అనే సినిమా రిలీజ్ కానుంది. నటి వేధింపుల కేసులో నిర్దోషిగా విడుదలైన 10 రోజుల్లోనే నటుడు దిలీప్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం. సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇందులో నిడివి ఎక్కువ ఉండే గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా ఇందులో నటిస్తున్నారు. 'ప్యూర్ మ్యాడ్‌నెస్' అని చెప్పుకుంటున్న ఈ సినిమాపై ప్రస్తుతం కేరళలో పెద్ద చర్చ జరుగుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More