మలయాళ సినిమాలకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న కథలను, సహజమైన భావోద్వేగాలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇటీవల కాలంలో ఓటీటీల పుణ్యమా అని అద్భుతమైన మలయాళ సినిమాలు నేరుగా మన ఇంటికే వస్తున్నాయి.

ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం లాంటి సినిమాలు భాషా భేదం లేకుండా అందరినీ కట్టిపడేశాయి. క్యారెక్టర్లు, వాటి చుట్టూ అల్లుకున్న సహజమైన ఎమోషన్స్ మలయాళ సినిమాల బలం. ఇప్పుడు సరిగ్గా ఇదే కోవలో మరో అద్భుతమైన కథ 'మేరి ఆవాజ్ సునో' (Meri Awas Suno) రూపంలో మన ముందుకు వస్తోంది.
మేరీ ఆవాజ్ సునో మూవీ విశేషాలు
జీవితంలో అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఊహించని కుదుపు వస్తే ఎలా ఉంటుంది? ఆ కుదుపు నుంచి కోలుకుని జీవితాన్ని మళ్లీ ఎలా నిర్మించుకోవాలి? అసలు అంతా ముగిసిపోయిందని అనుకున్నప్పుడు తిరిగి ఎలా నిలబడాలి? అనే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) వేదికగా మే 27 నుంచి ఈ మలయాళ మ్యూజికల్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. "ఆశ, భావోద్వేగాలు, జీవితం శాశ్వతంగా మారిపోయినప్పుడు బలాన్ని వెతుక్కోవడం.. ఇదొక హృదయపూర్వక ప్రయాణం" అంటూ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఎమోషనల్ టచ్
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శంకర్ ఒక పాపులర్ రేడియో జాకీ (ఆర్జే). మాటలతో మాయ చేస్తూ, తన గొంతుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటాడు. అతని వృత్తి, ప్రపంచం అంతా ఆ గొంతే. అలాంటి వ్యక్తికి గొంతు క్యాన్సర్ (లారింజియల్ క్యాన్సర్) వస్తే పరిస్థితి ఏంటి? చికిత్సలో భాగంగా తన గొంతు శాశ్వతంగా పోతుందని తెలిశాక శంకర్ జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. రేడియో జాకీగా తన కెరీర్ ముగిసిపోయిందని, ఇక జీవితంలో ఎలాంటి ఆశ లేదని తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు.
{{/usCountry}}ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శంకర్ ఒక పాపులర్ రేడియో జాకీ (ఆర్జే). మాటలతో మాయ చేస్తూ, తన గొంతుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటాడు. అతని వృత్తి, ప్రపంచం అంతా ఆ గొంతే. అలాంటి వ్యక్తికి గొంతు క్యాన్సర్ (లారింజియల్ క్యాన్సర్) వస్తే పరిస్థితి ఏంటి? చికిత్సలో భాగంగా తన గొంతు శాశ్వతంగా పోతుందని తెలిశాక శంకర్ జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. రేడియో జాకీగా తన కెరీర్ ముగిసిపోయిందని, ఇక జీవితంలో ఎలాంటి ఆశ లేదని తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు.
{{/usCountry}}సరిగ్గా ఆ సమయంలో డాక్టర్ రేష్మి అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ అయిన ఆమె.. శంకర్ తన కొత్త జీవితాన్ని అంగీకరించేలా చేస్తుంది. ఆ కష్టకాలం నుంచి బయటపడి, అతను మళ్లీ ఆత్మవిశ్వాసంతో ఎలా ముందడుగు వేశాడు అన్నదే 'మేరి ఆవాజ్ సునో' సినిమా ప్రధాన ఇతివృత్తం.
తొలిసారిగా జయసూర్య, మంజు వారియర్..
ఈ ఎమోషనల్ ప్రయాణంలో ఆర్జే శంకర్‌గా మలయాళ స్టార్ హీరో జయసూర్య జీవించగా, స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ రేష్మి పాత్రలో లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ అద్భుతంగా నటించారు. ఈ ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. వీరితో పాటు శివద, జానీ ఆంటోని, గౌతమి నాయర్, సుధీర్ కరమణ కీలక పాత్రలు పోషించారు.
సూపర్ హిట్ బెంగాలీ సినిమాకు రీమేక్..
నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ రూపొందించిన సూపర్ హిట్ బెంగాలీ చిత్రం 'కంటో' (2019) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో ప్రజేష్ సేన్ ఈ చిత్రానికి కథను అందించి, దర్శకత్వం వహించారు. బి. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు. ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, బీకే హరినారాయణన్ అద్భుతమైన పాటలు రాశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
'మేరి ఆవాజ్ సునో' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
ఈ ఎమోషనల్ డ్రామా మే 28వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మేరీ ఆవాజ్ సునో సినిమాను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఈ సినిమాను చూడొచ్చు.
'మేరి ఆవాజ్ సునో' కథాంశం ఏమిటి?
జీవితంలో అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు ఆశను కోల్పోకుండా, తిరిగి ఎలా ధైర్యంగా నిలబడాలనే ఎమోషనల్ జర్నీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.