OTT: ఓటీటీలోకి ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ ఫ్యామిలీ కామెడీ సిరీస్- 6గురు కజిన్స్, 7 పెళ్లిళ్లు- తెలుగులోనూ స్ట్రీమింగ్!

Cousins and Kalyanams OTT Streaming: ఓటీటీలోకి మలయాళ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ కజిన్స్ అండ్ కల్యాణమ్స్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఈ సిరీస్ తెలుగులో రానుంది. మరి కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: May 25, 2026, 14:37:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Cousins and Kalyanams OTT Release Telugu: ఒక్క కన్నుగీటు వీడియోతో దేశవ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఒమర్ లులు దర్శకత్వంలో వచ్చిన 'ఒరు అదార్ లవ్' తెలుగులో (లవర్స్ డే టైటిల్) సినిమాలోని ఆ ఒక్క సీన్ ఆమె లైఫ్‌ను మార్చేసింది. ఆ సినిమాలో ప్రియాతో కలిసి నటించిన రోషన్ అబ్దుల్ రహూఫ్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఓటీటీలోకి ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ ఫ్యామిలీ కామెడీ సిరీస్- 6గురు కజిన్స్, 7 పెళ్లిళ్లు- తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ ఫ్యామిలీ కామెడీ సిరీస్- 6గురు కజిన్స్, 7 పెళ్లిళ్లు- తెలుగులోనూ స్ట్రీమింగ్!

మలయాళ ఓటీటీ సిరీస్

ఇప్పుడు ఈ క్రేజీ జోడీ ఓటీటీ స్క్రీన్‌పై కనువిందు చేసేందుకు రెడీ అయింది . వీరిద్దరి కాంబినేషన్‌లో సరికొత్త మలయాళ ఓటీటీ వెబ్ సిరీస్ 'కజిన్స్ అండ్ కల్యాణమ్స్' (Cousins and Kalyanams) డిజిటల్ ప్రీమియర్‌ కానుంది. ఒక లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అటు మాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.

ఆరుగురు కజిన్ల కథ.. ఏడు పెళ్లిళ్ల హంగామా

ఈ ఓటీటీ సిరీస్‌ను ఒక స్వచ్ఛమైన కుటుంబ కథాచిత్రంగా మలిచారు. హాస్యం, బంధాలు, భావోద్వేగాల కలబోతగా ఈ ఓటీటీ సిరీస్ కథ సాగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కజిన్స్ (సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు) చుట్టూ ఈ ఓటీటీ సిరీస్ తిరుగుతుంది. వారంతా తమ జీవితాల్లోని విభిన్న దశలను దాటుకుంటూ.. కుటుంబంలో జరిగే వేడుకల ద్వారా ఎలా ఒకతాటిపైకి వచ్చారనేదే అసలు కథ.

ఈ సిరీస్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కథ మొత్తం ఏడు పెళ్లిళ్ల నేపథ్యంలో సాగుతుంది. ప్రతి పెళ్లి వేడుక కథలో ఒక కొత్త మలుపునకు దారితీస్తుంది. ఈ ప్రయాణంలో వారి మధ్య ఉన్న బంధాలకు ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? పాత స్నేహాలు ఎలా బలపడ్డాయి? మనసుల్లో దాచుకున్న ప్రేమ భావాలు ఎలా బయటపడ్డాయి? అనే విషయాలను దర్శకులు చాలా వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించనున్నారు.

టీజర్‌కు రెస్పాన్స్ అదుర్స్.. ఫ్యాన్స్ డిమాండ్!

ఇటీవలే విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ కజిన్స్ అండ్ కల్యాణమ్స్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రియా ప్రకాష్, రోషన్ జంటను మళ్లీ చూడటం ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పాత ఇష్యూస్ గురించి కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

"దయచేసి జియో హాట్‌స్టార్‌లో నిలిచిపోయిన 'ఏదో జన్మ కల్పనయిల్' ఎపిసోడ్‌లను తిరిగి తీసుకురండి.. చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఆ సీరియల్ చూడటానికి జియో హాట్‌స్టార్ ఏకైక మార్గమని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

మే 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్

ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ (JioHotstar) అధికారికంగా ప్రకటించింది. మే 29 నుంచి జియో హాట్‌స్టార్‌లో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మరో నాలుగు రోజుల్లో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.

తెలుగులోనూ రిలీజ్

విష్ణు చంద్రన్, కణ్ణన్ తామరక్కులమ్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మొత్తం 60 ఎపిసోడ్‌లుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌కు సంబంధించి.. ప్రతి శుక్రవారం నాలుగు కొత్త ఎపిసోడ్‌లను విడుదల చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లోనూ హాట్‌స్టార్ ఓటీటీలో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ అందుబాటులోకి రానుందని సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More