...
...
Next Story

ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా పేరు ఎకో. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.50 కోట్లు వసూలు చేయడం విశేషం.

Published on: Dec 26, 2025, 14:32:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కిష్కింధ కాండం' మూవీ టీమ్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' (Eko). థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. డిసెంబర్ 31న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా 5 భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఎకో ఓటీటీ రిలీజ్ డేట్, ఇతర విశేషాలు

ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు
ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు

మలయాళ మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి న్యూ ఇయర్ కానుక రెడీ అయ్యింది. దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎకో' సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేయొచ్చు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

వచ్చే బుధవారం అంటే డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. దీంతో ఓటీటీలో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఏంటీ ఎకో మూవీ స్పెషాలిటీ?

గత ఏడాది వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన 'కిష్కింధ కాండం' సినిమా గుర్తుందా? ఆ చిత్ర దర్శకుడు దింజిత్ అయ్యతన్, రచయిత, సినిమాటోగ్రాఫర్ బాహుల్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ఈ 'ఎకో'.

ఇది దర్శకుడి ‘యానిమల్ ట్రైలజీ’లో చివరి భాగం. గతంలో కిష్కింధ కాండం, కేరళ క్రైమ్ ఫైల్స్: సీజన్ 2 వచ్చాయి. ఆ రెండింటిలాగే ఈ ఎకో మూవీకి కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేయడం విశేషం.

ఎకో మూవీ కథేంటంటే?

అతన్ని వేటాడుతూ కొందరు ఆగంతకులు ఆ కొండపైకి వస్తారు. ఈ క్రమంలో అడవిలో దాగి ఉన్న రహస్యాలు, గతానికి సంబంధించిన చీకటి నిజాలు ఎలా బయటపడ్డాయన్నదే ఈ సినిమా కథ.

నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "అడవిలో చాలా రహస్యాలు దాగున్నాయి.. మరి సమాధానాలు కూడా అక్కడే దొరుకుతాయా?" అని ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం అనే థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe